Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు యువత కూడా బాగా అభిమానం చూపిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
మహేంద్ర వర్మ, జగతి (Jagathi) లు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చర్చలు చేస్తుంటారు. రిషి (Rishi) మిషన్ ఎడ్యుకేషన్ ఎందుకు వదులుకుంటున్నాడని.. పైగా కాలేజ్ కు మంచి పేరుందని.. గౌరవం ఉందని మాట్లాడుతుంటాడు.
28
అంతేకాకుండా ఆ కాలేజీలో చదివినందుకు నేను ఇప్పటికీ ఆ కాలేజ్ పై నమ్మకాన్ని చూపిస్తున్నాను అన్నట్లుగా జగతి (Jagathi) వాళ్లతో అంటాడు మినిస్టర్. అలా కాసేపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడి.. జగతి, రిషి (Rishi) ఆలోచనల గురించి గొప్పగా పొగుడుతుంటాడు.
38
ఎలాగైనా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను వదులుకోకుండా చూసుకోమని చెబుతాడు. మరోవైపు రిషి (Rishi) ఇంట్లో నుంచి మహేంద్రవర్మ (Mahendra Varma) వెళ్లిపోవడంతో అదే ఆలోచనలో ఉంటాడు. ఇక తనకు తన తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా వసును మాట్లాడించడం ఏంటని.. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని తనపై తాను కోపంతో రగిలిపోతాడు.
48
ఇక జగతి (Jagathi), మహేంద్రవర్మ కారులో ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక మిషన్ ఎడ్యుకేషన్ గురించి, రిషి ఆలోచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర వర్మ రిషి (Rishi) ఆలోచనలను వ్యతిరేకించగా.. దానికి జగతి రిషి ఆలోచనలను తప్పు పట్టవద్దని చెబుతుంది.
58
వెంటనే మహేంద్ర వర్మ (Mahendra Varma) ఎంతైనా తల్లి, కొడుకుల ఆలోచన ఒకటే అని.. ఇద్దరు గోల్డ్మెడలిస్ట్ అని పొగుడుతాడు. ఆ సమయంలో రిషి మహేంద్రవర్మ ఫోన్ కి ఫోన్ చేయటంతో మహేంద్రవర్మ కారు ఆపి ఫోన్ మాట్లాడుతాడు. ఇక రిషి (Rishi) తనను కలవమని అనడంతో సరే అని అంటాడు.
68
పైగా కలిసే ప్లేస్ కూడా మహేంద్ర (Mahendra) చెప్పటంతో.. రిషి.. డాడ్ ఇంటికి రారేమో అని బాధపడతాడు. మొత్తానికి ఇద్దరూ ఒకచోట కలిసి ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు. రిషి (Rishi) మాత్రం.. ఇంట్లో ఉండలేకపోతున్నాను డాడ్ అని.. అసలు ఇంటికి వెళ్లాలని లేదు అని.. ప్రతిక్షణం మీరే గుర్తుకొస్తున్నారు అని అంటాడు.
78
ఇంటికి రండి అని పిలుస్తాడు. కానీ మహేంద్రవర్మ ఒప్పుకోకుండా అక్కడి నుంచి బయల్దేరి జగతి ఇంటికి వెళ్తాడు. ఇక జగతి (Jagathi) రిషి గురించి పదేపదే అడగటంతో మహేంద్ర వర్మ చెప్పకుండా వాటర్ తెమ్మని పంపిస్తాడు. జగతి లోపలికి వెళ్ళి పోవడం తో మహేంద్ర రిషి (Rishi) మాటలు గుర్తు చేసుకొని బాగా ఏడుస్తాడు.
88
అప్పుడే జగతి (Jagathi) రావడంతో ఎప్పటి లాగే ఉండి.. తనతో రిషి గురించి మాట్లాడుతుంటాడు. రిషి కి అన్ని విధాలుగా తోడుగా ఉండే ఒకే ఒక్క వ్యక్తి వసు అని వసు వైపు చూపిస్తాడు. ఇక జగతి వసును ఏమైనా తిను అని అనడంతో.. అప్పుడే రిషి (Rishi) ఫోన్ చేస్తాడు. వెంటనే రిషి దగ్గరికి వెళ్లిపోతుంది వసు. ఎక్కడికి వెళుతున్నాం సార్ అని అనడంతో రిషి వెటకారంగా సమాధానం ఇస్తాడు. తరువాయి భాగం లో ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్లినట్లు కనిపిస్తారు.