`సలార్‌`లో తండ్రికొడుకులుగా ప్రభాస్‌.. వెయ్యిమందితో ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలైట్.. ఫ్యాన్స్ కి పూనకాలే!

Published : Aug 20, 2023, 09:53 AM ISTUpdated : Aug 20, 2023, 09:57 AM IST

`సలార్‌` సినిమా నుంచి మరో సంచలన అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఫ్యాన్స్ ఊగిపోయే అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. `సలార్‌` పాన్‌ వరల్డ్ మూవీ కాబోతుందట. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా అవుతుందట.   

PREV
16
`సలార్‌`లో తండ్రికొడుకులుగా ప్రభాస్‌.. వెయ్యిమందితో ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలైట్.. ఫ్యాన్స్ కి పూనకాలే!

పాన్ ఇండియా ఇమేజ్‌ని దాటుకుని గ్లోబల్‌ స్టార్‌గా వెలుగుతున్న ప్రభాస్‌.. ఇప్పుడు రెండు భారీ సినిమాల(సలార్‌, కల్కి)తో రాబోతున్నారు. అందులో `సలార్‌` వచ్చే నెలలోనే రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సంచలన అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఫ్యాన్స్ ఊగిపోయే అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. `సలార్‌` పాన్‌ వరల్డ్ మూవీ కాబోతుందట. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా అవుతుందట, అంతేకాదు, ఇప్పటి వరకు ప్రభాస్‌ ది ఒక్క లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. 
 

26

`కేజీఎఫ్‌` వంటి సంచలన మూవీ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ `సలార్‌` చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమలో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. వచ్చే నెల(సెప్టెంబర్‌) 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. గ్లింప్స్ అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్‌ చేసింది. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 
 

36

అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ లీక్‌ నెట్టింట రచ్చ చేస్తుంది. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.  తండ్రి కొడుకులుగా కనిపిస్తారని సమాచారం. తండ్రి సలార్‌ అని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో ఓ అదిరిపోయే సీన్‌ ఉందట. యుద్ధభూమిలో వెయ్యి మంది విలన్లు ప్రభాస్‌ని చుట్టుముడితే అప్పుడు అసలైన సలార్‌ దిగుతాడని, అప్పుడు వచ్చే సీన్‌ సంచలనాత్మకంగా ఉంటుందని, ఆ సీన్‌ నెక్ట్స్ లెవల్‌ అని ఓ అభిమాని వెల్లడించారు. `సలార్‌` సెట్‌లో తాను చూసి విషయాన్ని ఆయన ఇలా లీక్‌ చేశాడు. దాని కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారట. 
 

46
Salaar Part 1

సినిమా మొత్తంలో అది హైలైట్‌ ఎపిసోడ్‌ అని, ఆ సీన్‌కి థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియెన్స్ సీట్లో కూర్చొరని, పూనకాలతో ఊగిపోతారని అంటున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే అని చెబుతున్నారు. సినిమాని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రాజీపడకుండా భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. `కేజీఎఫ్‌`ని మించిన ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఇది పాన్‌ ఇండియా సినిమా కాదు, గ్లోబల్‌ రికార్డులను షేక్‌ చేసే మూవీ అని చెబుతున్నారు. `సలార్‌`పై భారీ హైప్‌ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

56
salaar Movie Teaser

దీంతోపాటు మరో లీక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది `ఉగ్రం` చిత్రాన్ని పోలి ఉంటుందని సమాచారం. `కేజీఎఫ్‌`కి ముందు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కన్నడలో `ఉగ్రం` అనే మూవీ చేశాడు. ఇది మంచి విజయం సాధించింది. మొదట ఈ సినిమాని ప్రభాస్‌తో చేయాలనుకున్నారు. కానీ అప్పుడు వర్కౌట్‌ కాలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` అటు ఇటుగా `ఉగ్రం`ని పోలీ ఉంటుందట. అందులో ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్స్ తో సినిమాని నడిపించాడు, ఇందులో తండ్రి కొడుకులుగా మార్చారట. 

66

ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో భారీ యాక్షన్‌, డ్రామాతోపాటు అంతర్లీనంగా మంచి ఎమోషన్స్, సెంటిమెంట్‌ ఉంటుంది. `ఉగ్రం`లో ఫ్రెండ్స్ ఎమోషన్‌ అయితే, `కేజీఎఫ్‌`లో అమ్మ సెంటిమెంట్‌ని తీసుకున్నారు, `సలార్‌`లో తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ హైలైట్‌గా ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఇది సినిమాపై హైప్‌ని మరింత పెంచుతుంది. మరి ఇందులో నిజానిజాలేంటనేది తెలియాల్సి ఉంది. ఇక `సలార్‌` రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం `సలార్‌ః సీజ్‌ ఫైర్‌` సెప్టెంబర్‌లో రాబోతుండగా, రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories