`ఆత్మగౌరవాన్ని సీఎం కాళ్ల వద్ద తాకట్టుపెట్టిన రజనీ`.. సూపర్‌ స్టార్ పై దారుణంగా ట్రోల్స్ !

Published : Aug 20, 2023, 08:40 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. వివాదాల్లో ఇరుక్కుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం కాళ్లకి నమస్కారం పెట్టడంపై అభిమానులు షాక్‌ అవుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.   

PREV
15
`ఆత్మగౌరవాన్ని సీఎం కాళ్ల వద్ద తాకట్టుపెట్టిన రజనీ`.. సూపర్‌ స్టార్ పై దారుణంగా ట్రోల్స్ !

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇటీవలే `జైలర్‌` సినిమాతో తన రేంజ్‌ ఏంటో చూపించిన రజనీ.. తాజాగా ఆయన చేసిన పని దారుణమైన ట్రోల్స్ కి కారణమవుతుంది. రజనీకాంత్‌ శనివారం.. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. అయితే మొదట ఆయన్ని చూడగానే.. రజనీకాంత్‌ వెళ్లి యోగి కాళ్లు మొక్కడం గమనార్హం. దీంతో అంతా షాక్‌ అవుతున్నారు. 72ఏళ్ల రజనీకాంత్‌.. 51ఏళ్ల యోగి కాళ్లకి నమస్కారం చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అది రజనీపై ట్రోల్స్ కి కారణమవుతుంది. 
 

25

రజనీకాంత్‌ సౌతిండియాలో తిరుగులేని సూపర్‌ స్టార్‌. నార్త్ లోనూ ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. ఇంటర్నేషనల్‌గా మంచి ఫాలోయింగ్‌ ఉంది. విదేశాల్లోనూ రజనీ క్రేజ్‌ మామూలిది కాదు. ఇండియా మినహాయితే విదేశాల్లోనూ భారీ ఫాలోయింగ్‌ ఉన్న మొదటి హీరో రజనీ. ఆయనకు చాలా కాలంగా హిట్లు లేక ఆయన రేంజ్‌ తెలియడం లేదు. తాజాగా `జైలర్‌` మూవీ రజనీ క్రేజ్‌ని, మార్కెట్‌ని చూపిస్తుంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారు రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించడం విశేషం. 
 

35

కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఏ హీరో అభిమాని అయినా కామన్‌గా రజనీకి ఫ్యాన్‌ అయి ఉంటారు. సినిమాకి అతీతంగా ఆయనకు అభిమానులుంటారు. అంతటి ఫాలోయింగ్‌ ఉన్న రజనీ ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి కాళ్లకి నమస్కారం చేయడం ఇప్పుడు రచ్చ లేపుతుంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. రజనీ తమ ఆత్మగౌరవాన్ని సీఎం యోగి కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని అభిమానులు, తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీ తమ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేశారని అంటున్నారు. రజనీ చర్య అత్యంత విచారకరం అంటున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

45

తనకంటే వయసులో తక్కువైన వ్యక్తి యోగి కాళ్లకి రజనీకాంత్‌ ఎందుకు నమస్కారం చేశారంటూ మండిపడుతున్నారు. ఇది తమకి చాలా అవమానమైన విషయమంటున్నారు తమిళ ఫ్యాన్స్. అయితే దీన్ని సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. యోగి ఒక సన్యాసి అని, రజనీ అలా చేయడంలో తప్పులేదని అంటున్నారు. ఆథ్యాత్మిక కోణంలో రజనీ అలా చేశారని, దాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తానికి రజనీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారారు. వివాదానికి కేరాఫ్‌గా నిలిచారు. 

55

ఇక రజనీకాంత్‌.. ఇటీవల `జైలర్‌` చిత్రంలో నటించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సన్‌ పిక్చర్స్ నిర్మించారు. ఆగస్ట్ 10న ఈ సినిమా విడుదలైంది. భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నాలుగువందల కోట్లు దాటింది. తమిళనాట బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలవబోతుంది. రజనీ మాస్‌ యాక్షన్‌, అనిరుథ్‌ రవిచందర్‌ బీజీఎం, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ గెస్ట్ అప్పీయరెన్స్, దర్శకుడు దిలీప్‌ టేకింగ్‌ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ గా నిలిచాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories