నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది . సీక్వెల్ హిట్ 2గా తెరెకెక్కింది. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రచార కార్యక్రమాలు కూడా హోరెత్తించారు.