Pushpa-Akhanda: బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్ప-అఖండ చిత్రాల మధ్య షాకింగ్ పోలికలు.. తెలిస్తే వావ్ అంటారు!

First Published Jan 12, 2022, 1:21 PM IST

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లేలా అఖండ-పుష్ప చిత్రాలు చేశాయి. రెండు చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులపగా నిర్మాతల గుండెల్లో ధైర్యం నింపాయి.

పాన్ ఇండియన్ హీరోస్ గా టాలీవుడ్ లో ఒక్కొక్కరు పైకి ఎదుగుతున్న సమయంలో తనకు కూడా ఒక భారీ లాంఛ్ కావాలని భావిస్తున్న వేళ పుష్ప (Pushpa) ఒక మాస్ ఇమేజ్ ని బన్నీకి అందించింది. ఇదే టైం లో కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్యకు ఇదొక పర్ఫెక్ట్ బ్రేక్ ఇచ్చింది. పుష్పతో అల్లు అర్జున్ ఇమేజ్ మరో స్థాయికి చేరగా.. పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. 
 

పుష్ప, అఖండ సినిమాలను పరిశీలిస్తే చాలా పోలికలు కనబడుతాయి. అంతే కాకుండా రెండు సినిమాలు కూడా మాస్ పల్స్ పట్టుకున్న సినిమాలు. బి,సి సెంటర్లలో అఖండ, పుష్ప జాతర ఏ స్థాయిలో జరుగుతుందో అందరికి తెలిసిందే. చాలా కాలం తర్వాత నిరవధికంగా నాలుగైదు వారాలు థియేటర్స్ లో సందడి చేసిన చిత్రాలుగా ఇవి నిలిచాయి.


ఈ రోజుల్లో సినిమా హిట్టో ఫట్టో మొదటివారం కలెక్షన్స్ తోనే తేలిపోతుంది. ఒకప్పటిలా వందల రోజులు థియేటర్స్ లో సినిమా అదే పరిస్థితి లేదు. ఓపెనింగ్స్ టోన్ పెట్టుబడి, లాభం రాబట్టాలి. దీనికి బిన్నంగా పుష్ప, అఖండ వసూళ్లు కొనసాగాయి. మూడు, నాలుగు వారాలు స్థిరంగా వసూళ్లు రాబట్టాయి. ఇది కూడా ఈ రెండు చిత్రాల మధ్య చోటు చేసుకున్న మరో ప్రధాన పోలిక. 

అంతే కాకుండా రెండు సినిమాల్లో ఇద్దరు హీరోలను ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపెట్టారు దర్శకులు. అల్లు అర్జున్ (Allu Arjun)ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సాహసం చేయని డీ గ్లామర్ పాత్ర చేస్తే బాలయ్య అఘోర పాత్రలో దుమ్ము దులిపాడు. ఈ రెండు ఛాలెంజింగ్ రోల్స్ అని చెప్పాలి. ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వస్తుంది. కానీ దర్శకులపై నమ్మకంతో బన్నీ, బాలయ్య మొండిగా ముందు వెళ్లారు.

బాలయ్య (Balakrishna), అల్లు అర్జున్ కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరికి కెరీర్ బెస్ట్ మూవీ దక్కింది. అదే సమయంలో నయా రికార్డ్స్ తమ పేరున నమోదు చేస్తున్నారు. పుష్ప అల్లు అర్జున్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, బాహుబలి 2, సాహో చిత్రాల తర్వాత టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా ఉంది. అఖండ బాలయ్య కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది.


ఈ రెండు సినిమాల్లోను దర్శకుడి పాత్ర కన్నా హీరోల పాత్ర బాగా ఎలివేట్ అయింది. ఇక స్టోరీ లైన్ కూడా ప్లైన్ గానే ఉంది. పెద్ద హీరో సినిమాని మంచిగా చూపెట్టగలిగితే మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించొచ్చు అనే విషయాన్ని ఈ రెండు చిత్రాలు ప్రూవ్ చేసాయి. మొత్తంగా పుష్ప, అఖండ ల మధ్య పోలికలను చూసిన వారు సేమ్ అనే అంటున్నారు..!

click me!