బుల్లితెర హీరోయిన్ అయినప్పటికీ శ్వేతా తివారి అందంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెని 3 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఎంతటి అందాల భామ అయినా 40 ఏళ్ళు నిండితే వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఆమె ఫోజులు, సమ్మోహనపరిచే అందాలు చూస్తుంటే.. శ్వేతా తివారి వయసుని మింగేస్తుందా అనే అనుమానం కలగక మానదు.