Tamannah:బ్యాక్ చూపిస్తూ తమన్నా హాట్ ఫోటో షూట్... గ్లామర్ తో సెగలు రేపుతున్న ఎఫ్3 భామ!

Published : Feb 26, 2022, 04:51 PM IST

ఏ హీరోయిన్ కైనా పట్టుమని పదేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. అలనాటి స్టార్ హీరోయిన్స్ విజయశాంతి, సౌందర్య, రమ్యకృష్ణ లాంటి వారిని మినహాయిస్తే, ఏళ్ల తరబడి పరిశ్రమలో తిరుగులేకుండా ప్రస్థానం సాగించిన భామలు చాలా తక్కువ మంది ఉన్నారు.

PREV
18
Tamannah:బ్యాక్ చూపిస్తూ తమన్నా హాట్ ఫోటో షూట్... గ్లామర్ తో సెగలు రేపుతున్న ఎఫ్3 భామ!

ఈ లిస్ట్ లో తమన్నాను కూడా చేర్చవచ్చు. కారణం తమన్నా(Tamannah) వెండితెరకు పరిచయమై 15ఏళ్ళకు పైనే అవుతుంది. అయినా ఆమె ఫేమ్, పాపులారిటీ అస్సలు తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో యంగ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇస్తున్నారు.

28

చక్కని నటన, అంతకు మించిన గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుంది. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రంలో తమన్నా, మెహ్రీన్ సెమీ బికినీలు వేసి షాక్ ఇచ్చారు. బికినీలలో పక్కపక్కనే ఇద్దరూ నడిచి వస్తుంటే, తమన్నా గ్లామర్ ముందు, మెహ్రీన్ పూర్తిగా డామినేట్ అయ్యారు. 

38


సిమ్లా యాపిల్ లా ఉండే మెహ్రీన్ కూడా తమన్నా గ్లామర్ ముందు నిలబడలేకపోయింది. ఇక కెరీర్ బిగినింగ్ లో పద్ధతిగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన తమన్నా... స్టార్ హీరోల చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేశారు. స్టార్ గా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. 
 

48

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నా తీసుకున్నా డేరింగ్ స్టెప్. రంగం, అల్లుడు శీను, జై లవకుశతో పాటు పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. స్పెషల్ సాంగ్స్ చేసిన వారికి హీరోయిన్ గా అవకాశాలు రావు అనేది అపోహ మాత్రమే అని తమన్నా నిరూపించారు.

58

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ బాషలలో ఆమె క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తున్న వెంకీ, వరుణ్ మల్టీస్టారర్ ఎఫ్ 3 మూవీలో తమన్నా నటిస్తున్నారు. అలాగే  సత్యదేవ్ కి జంటగా 'గుర్తుందా శీతాకాలం' మూవీ చేస్తున్నారు. గుర్తుందా శీతాకాలం టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

68

తమన్నా చేతిలో ఉన్న మరో పెద్ద చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా చేయడం విశేషం.  వరుణ్ లేటెస్ట్ మూవీ గని లో ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా ఆడిపాడనున్నారు. గని విడుదలకు సిద్ధంగా ఉంది. 
 

78

నవాజుద్దీన్ సిద్దిఖీకి జంటగా బోల్ చుడియా అనే హిందీ చిత్రం చేస్తుంది తమన్నా. అలాగే హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ మూవీలో తమన్నా నటించారు. ఈ చిత్రం డిలే కావడం జరిగింది. మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు.

88

కెరీర్ ఇలా ఫుల్ స్వింగ్ లో ఉండగా వరుస ఫోటో షూట్స్ తో మరింత పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తమన్నా. తాజాగా ఆమె ట్రెండీ డిజైనర్ వేర్ లో సూపర్ స్టైలిష్ లుక్ తో పాటు తిరుగులేని గ్లామర్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు . తమన్నా లేటెస్ట్ ఫొటో వైరల్ గా మారాయి.

click me!

Recommended Stories