ఎపిసోడ్ ప్రారంభంలో మీరిద్దరూ భార్యాభర్తలు అనడానికి ఏమిటి సాక్ష్యం అంటాడు పోలీసు. మేము ఈ మధ్యనే తీసుకున్న ఫోటో ఒకటి ఉంది కావాలంటే చూపిస్తాం అంటూ రాజ్ ని ఫోన్ తీయమంటుంది కావ్య. పాన్ షాపు పక్క సందులోనే ఉంటుంది కదా అని సెల్ తీసుకురాలేదు అంటాడు రాజ్. నన్ను కూడా తీసుకురానివ్వలేదు, మీరు కూడా తీసుకురాలేదు అంటూ గొడవ పడుతుంది కావ్య.