Leo Review: లియో ట్విట్టర్ రివ్యూ.. విజయ్ ఫ్యాన్స్ కి ఓకె, లోకేష్ కనకరాజ్ స్పార్క్ మిస్సయ్యిందా..

First Published | Oct 19, 2023, 7:02 AM IST

స్టైలిష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత సౌత్ లో మోస్ట్ వాంటెండ్ డైరెక్టర్ గా మారిపోయారు. లోకేష్ కనకరాజ్ టేకింగ్ అందరి దర్శకులకు భిన్నంగా అబ్బురపరిచే విధంగా ఉంటోంది.

స్టైలిష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత సౌత్ లో మోస్ట్ వాంటెండ్ డైరెక్టర్ గా మారిపోయారు. లోకేష్ కనకరాజ్ టేకింగ్ అందరి దర్శకులకు భిన్నంగా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో లియో అనే యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

విక్రమ్ చిత్రం సృష్టించిన రికార్డుల దృష్ట్యా లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు లియో చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తమిళనాడులో అయితే విజయ్ అభిమానుల్లో పండగ కోలాహలం నెలకొంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా త్రిష నటించింది. సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రానికి ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 


లియో మూవీ ఫస్ట్ హాఫ్ కి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మొదటి గంట ఈ చిత్రం చాలా స్లోగా సాగుతుందట. హైనాతో వచ్చే సన్నివేశం అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాలో సర్ప్రైజ్ ఎంట్రీ వచ్చిన తర్వాత లియో చిత్రం ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బావుందని ట్విట్టర్ లో నెటిజన్లు చెబుతున్నారు. 

టెక్నికల్ గా లియో చిత్రం అద్భుతం అని అంటున్నారు. మరో నెటిజన్ లియో చిత్రం యావరేజ్ గా ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో వచ్చే ఒక కీలక ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే చిత్రం అవుతుందా అంటే అనుమానమే. మూవీ నిడివి ఎక్కువగా ఉంటూ స్లోగా సాగుతోంది అని ట్విట్టర్ లో కొందరి నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

మరో నెటిజన్ లియో చిత్రం అద్భుతంగా ఉందంటూ రెస్పాన్స్ ఇచ్చారు. లియో మూవీ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండింటిలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. లోకేష్ కనకరాజ్ కి ఇది మరో బ్లాక్ బస్టర్ అంటూ రెస్పాన్స్ ఇస్తున్నారు. 

మరికొందరు లియో కంటే మాస్టర్ మూవీ బెటర్ అని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు లియో చిత్రాలు ఆకట్టుకునే విధంగా లేదని.. ఖైదీ, విక్రమ్ చిత్రాల్లో కనిపించిన లోకేష్ కనకరాజ్ స్పార్క్ ఈ చిత్రంలో లేదని అంటున్నారు. 

మరో నెటిజన్ ట్విట్టర్ లో.. కొన్ని బోరింగ్ సన్నివేశాలు.. యావరేజ్ గా అనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పక్కన పెడితే లియో చిత్రం బావుందని అంటున్నారు. టెక్నికల్ గా ఈ చిత్రం లో ఎలాంటి లోపాలు లేవు. ట్విస్ట్ లు, అనిరుద్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. లియో చిత్రం కేవలం విజయ్ అభిమానులకు మాత్రమే అని నెటిజన్లు అంటున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బోరింగ్ గా మారుతోంది. లోకేష్ ఇది చెక్ చేసుకోవాల్సిన సమయం అంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్ లో లియో చిత్రానికి యావరేజ్ అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. 

Latest Videos

click me!