పాప్ ప్రపంచాన్ని ఏలిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్' బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా కలెక్షన్లు కొల్లగొట్టిందీ మూవీ. 5000 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతోంది.
కొన్ని సినిమాలు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర రాస్తాయి. ఇప్పుడు 'మైఖేల్' సినిమా అదే పని చేస్తోంది. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. జాఫర్ జాక్సన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.
25
4 రోజుల్లోనే 2200 కోట్లు..
గత ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా, మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,200 కోట్లు (సుమారు $260 మిలియన్లు) వసూలు చేసింది. ఒక మ్యూజిషియన్ బయోపిక్ ఇంత వేగంగా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి. ఇండియాలోనూ 4 రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా రాబట్టింది.
35
మైఖేల్ జాక్సన్‌గా నటించిన జాఫర్ జాక్సన్
ఈ భారీ విజయానికి ముఖ్య కారణం మైఖేల్ జాక్సన్‌గా నటించిన జాఫర్ జాక్సన్. ఇతను మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు. జాక్సన్ యూనిక్ డ్యాన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్‌ను జాఫర్ అచ్చుగుద్దినట్లు స్క్రీన్‌పై చూపించాడు. జాక్సన్ జీవితంలోని పోరాటాలు, జాతి వివక్షపై అతని నిరసన, సంగీత ప్రపంచంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా చాలా ఎమోషనల్‌గా చూపించారు.
ప్రస్తుతం ప్రపంచమంతటా మళ్లీ 'మైఖేల్ జాక్సన్ మేనియా' మొదలైంది. రాబోయే వారాలకు కూడా టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, ఈ సినిమా రానున్న రోజుల్లో రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
55
మైఖేల్ జాక్సన్ కు ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గౌరవం
'మైఖేల్' సినిమా కేవలం కలెక్షన్ల కోసమే కాదు, సంగీత ప్రపంచపు రాజుకు సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. గతంలో వచ్చిన 'బోహేమియన్ రాప్సోడీ' వంటి బయోపిక్ చిత్రాల రికార్డులను ఇది త్వరలోనే బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ మేజిక్ ఇంకా తగ్గలేదని ఈ 4 రోజుల వసూళ్లు నిరూపించాయి.