MGR, SPB
గానగాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట పాడితో అన్ని మరిచిపోయి అలా ఉండిపోతాం. ఆయన గాత్రంలోని మాధుర్యం అంత గొప్పది. ఆయన స్వరంతో మెరిసిన పాటలు కోకొల్లలు. అలాంటి సంగీత ధురంధరుడైన ఎస్.పి.బి., ఆయన తన స్వరంతో మొదటిసారిగా పాడిన తమిళ పాట ‘ఆయిరం నిలవే వా’. ఎం.జి.ఆర్ నటించిన ‘అడిమై పెణ్’ చిత్రం కోసం ఈ పాట పాడారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
SPB
ఈ పాట వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒకరోజు ఎవిఎం స్టూడియోలో ఎంజీఆర్ తన సినిమా గురించి చర్చిస్తుండగా, పక్కనే ఉన్న సెట్‌లో ఒక తెలుగు సినిమా పాట కంపోజింగ్ జరుగుతోంది. అందులో ఎస్.పి.బి. పాడుతున్నారు. ఆయన స్వరం విని ముగ్ధుడైన ఎం.జి.ఆర్ ఎవరీయన ఇంత అద్భుతంగా పాడుతున్నారని అడిగారట.
వెంటనే ఎస్.పి.బి.ని పిలిపించి తన సినిమాలో తప్పకుండా పాడాలని కోరారు ఎంజీఆర్. తమిళంలో తన మొదటి పాటే ఎంజీఆర్‌కి అంటూ సంతోషపడిన ఎస్.పి.బి. అందుకు అంగీకారం తెలిపి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎస్.పి.బి.కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీంతో ఆయన ఆ పాట పాడలేకపోయారు.
పాట పాడలేకపోయానే అని ఎస్.పి.బి. బాధపడుతుంటే, ఎంజీఆర్ నుంచి సమాచారం వచ్చింది. నువ్వు బాధపడకు. ఈ పాట నువ్వే పాడాలి. నీ ఆరోగ్యం కుదుటపడే వరకు ఆగుతాం, ఆ తర్వాత రికార్డింగ్ పెట్టుకుందాం అని అన్నారట ఎంజీఆర్.
అలా ఎస్.పి.బి. తమిళంలో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన పాటే ఎంజీఆర్ ‘అడిమై పెణ్’ చిత్రంలోని ‘ఆయిరం నిలవే వా’. ఎస్.పి.బి. కోసం ఎంజీఆర్ దాదాపు రెండు నెలలు వేచి చూసి, ఆ తర్వాత రికార్డ్ చేయించిన ఈ పాట నేటికీ తమిళ సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.