Mentoo Movie Review : ‘మెన్ టూ’ మూవీ రివ్యూ!

First Published May 26, 2023, 7:39 PM IST

ఈరోజు థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో Mentoo సినిమా ఒకటి. రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. మరీ ఈ చిత్రం థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.
 

ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించాలంటే దర్శక నిర్మాతలకు సవాల్ గానే మారింది. మరోవైపు చిన్న సినిమాలైనా బలమైన కథ, అందుకు తగ్గట్టుగా దర్శకత్వం ఉంటే ఆడియెన్స్ ఆ చిత్రాలను ఓన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకు ఉదాహరణగా ‘కాంతారా’, ‘బలగం’ చిత్రాలను చెప్పుకొవడం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘మెన్ టూ’. ఇంతకీ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
 

కథ :

స్టాగ్స్ ఓన్లీ అనే పబ్ లో ఆదిత్య (నరేష్ అగస్త్య), సంజు (కౌశిక్), మున్నా (మౌర్య సిద్ధవరం), రాహుల్ (వైవా హర్ష) రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. ఇక్కడి పబ్ కు వచ్చే వారందరూ తమ కష్టాలను చెప్పుకుంటూ ఉంటారు.  అయితే ప్రధాన పాత్రలు ఏదోక సమయంలో అమ్మాయిల బాధితులే. వీరు వర్క్ చేసే ఆఫీస్ ల్లో తప్పుడు సెక్రువల్ హెరాస్ మెంట్ ఎదుర్కుంటారు. అలాగే తమను విసిగించే గర్ల్ ఫ్రెండ్ నూ భరిస్తూ వస్తుంటారు. మరోవైపు వీరిలో మహిళా సంఘం అధ్యక్షురాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి కష్టాలు వర్ణణాతీతంగా ఉంటాయి. ఈ క్రమంలోనే వీరిలోని రాహుల్ మరణం విషాదకరంగా ఉంటుంది. ఆ ప్రభావం మిగితా వారిపైనా పడుతుంది. ఇంతకీ రాహుల్ ఎలా చనిపోయాడు? నరేష్, మౌర్య, సంజు అమ్మాయిలతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మిగితా జీవితం ఎలా సాగిందనేదే? మిగిలిన కథ.
 
 

విశ్లేషణ :

భార్యతో భర్తలు పడే బాధలను దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్2‘ చిత్రంలో చక్కగా చూపించిన విషయం తెలిసిందే. ఇక అలాంటి మాదిరి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మెన్ టూ’ అని చెప్పొచ్చు. చిత్ర కథ ఎంచుకున్న శ్రీకాంత్ రెడ్డి సాహసమే చేశాడని చెప్పొచ్చు. అమ్మాయిలతో మగాళ్ల పడే బాధలను చూపించాలంటే, అది ప్రేక్షకులను థియేటర్లలో కూర్చొబెట్టాలంటే కేవలం సన్నివేశాలతోనే కాకుండా బలమైన కథ కూడా కావాల్సి ఉంటుంది. ఆ విషయంలో శ్రీకాంత్ మరికొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. చిత్రంలోని నాలుగు ప్రధానమైన పాత్రలను, పాత్రల తాలుకా పాయింట్ ఆఫ్ వ్యూను చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో కామెడీ సీన్స్ బాగుంటాయి. వైవా హర్ష పాత్ర మొదటి నుంచి భావోద్వేగంగా సాగుతుంది. హర్ష మరణం తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ద్వితీయార్తం పూర్తిగా ఎమోషనల్ గానే నడుస్తుంది. కానీ  సన్నివేశాలు ఊహించే విధంగానే ఉంటాయి. చివర్లో హీరో అగస్త్య ఇచ్చే స్పీచ్ బాగుంటుంది. వారి ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను మరింత బాగా చూపించడంతో పాటు బలమైన కథ కూడా ఉంటే సినిమా ఇంకాస్తా బాగుండేదనే అభిప్రాయం కలిగింది. అలాగే సినిమా చివర్లో రెండో భాగానికి కూడా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం రెస్పాన్స్ కు సీక్వెల్ తీస్తారా అన్నది చూడాలి.

నటీనటులు, టెక్నీషియన్లు : నరేష్ అగస్త్య ప్రధాన ప్రాతలో ఆకట్టుకున్నారు. తన పాత్రకు న్యాయం చేశారు. ఆయా సన్నివేశాల్లో మంచి పెర్ఫామెన్స్ అందించారు. కౌశిక్ ఎమోషనల్ సన్నివేశాలను బాగా పండించారు. మౌర్య సిద్దవరం పాత్రకు న్యాయం చేశారు. ఇక వైవా హర్ష గతంలో ఎప్పుడూ లేని పాత్రలో కనిపించినట్టు, ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించారు. బ్రహ్మాజీ తన పాత్రలో జీవించారు. ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ అందించిన పాటలు పర్లేదనే చెప్పాలి. నేపథ్యం సంగీతం కూడా పర్లేదనిపిస్తుంది. డీవోపీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 
 

ప్లస్ లు, మైనస్ లు :

చిత్రంలో కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే ఎమోషన్ సన్నివేశాల్లోనూ ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. నటీనటులు పెర్ఫామెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

ఇక శ్రీకాంత్ జీ రెడ్డి రాసుకున్న కథ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండాల్సింది. మరోవైపు కీ సీన్స్ ను చాలా ఈజీగా చెప్పినట్టు అనిపిస్తోంది. కథనంలో నేచురల్ నెస్ కనిపించకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.
 

రేటింగ్‌ః 2.5
నటీనటులు : నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, తదితరులు
డీవోపీ : పీసీ మౌళి
మ్యూజిక్ : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
ఎడిటర్ : కార్తీక్ పున్నవా
ప్రొడ్యూసర్ : మౌర్య సిద్ధవరం
రచన, డైరెక్టర్ :  శ్రీకాంత్ జీ రెడ్డి 
రిలీజ్ డేట్ : మే, 26, 2023 

click me!