డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నా, తగ్గేదే లేదంటున్న హీరోయిన్ మెహ్రీన్

Published : May 01, 2022, 04:39 PM IST

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్‌ టాలీవుడ్ లో.. దూసుకుపోతోంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. త్వరలో ఎఫ3 మూవీతో సందడి చేయబోతోంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తోంది బ్యూటీ.   

PREV
16
డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నా, తగ్గేదే లేదంటున్న హీరోయిన్ మెహ్రీన్

కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. ఈ సినిమాతో ఆడయన్స్ లో గుర్తుండిపోయింది. ఆతరువాత వరుస అవకాశాలు చేజిక్కించుకుంది.  వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్  తో పాటు ఫెయిల్యూర్స్ కూడా బాలన్స్ చేసుకుంటూ కెరీర్ ను సాగిస్తోంది. 

26

మధ్యలో సినిమాలు మానేసి పెళ్ళి చేసుకుందాం అనుకుంది మెహరీన్. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తరువాత పెళ్లి కాన్సిల్ చేసుకుని... కెరీర్ మీద దృష్టి పెట్టింది మెహరీన్. వరుసగా ఆఫర్లు సాధించడంతో పాటు.. సినిమాలకు తగ్గట్టు మేకోవర్ కూడా అయ్యింది మెహరీన్. 

36

ఎఫ్2 సినిమాతో  సందడి చేసిన మెహరీన్ అల్లరి, అమాయకత్వం కలబోసిన హనీ పాత్రలో ఆమె కావాల్సినంత వినోదాన్ని పంచింది. హనీ ఈజ్‌ ది బెస్ట్‌ అంటూ హడావిడి చేసిన మెహరీన్ ఈసారి అంతకు మించి అన్నట్టు.. ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్‌-3 సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలో  ఈ అమ్మడి పాత్రను అద్భుతంగా డిజైన్‌ చేశారట. 
 

46

ఎఫ్ 3లో తన పాత్ర గురించి రీసెంట్ గా రివిల్ చేసింది మెహరీన్. సినిమాలో తన క్యారెక్టర్ కంప్లీట్ గా వినోదాత్మకంగా సాగుతుందని అంటోంది పంజాబీ భామ. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, సోనాల్‌చౌహాన్‌ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాని అనిల్‌ రావిపూడి డైరెక్ట్ చేశారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. 
 

56

ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాల విందును అందించడానికి ముందుకురానుంది ఎఫ్3 . వెంకటేశ్‌ సరసన తమన్నా, వరుణ్‌ తేజ్‌కి జోడీగా మెహరీన్‌ నటించారు. అయితే ఎఫ్‌ 3లో మాత్రం రెండు షేడ్స్‌తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనుంది మెహరీన్ 

66

మెహరీన్‌ క్యారెక్టర్‌ మెచ్యూర్డ్‌గా డిఫరెంట్‌ లేయర్స్‌తో ఉంటుందట. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది అని అంటోంది హీరోయిన్. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ రోల్‌ అని మెహరీన్‌ స్యంయంగా అన్నారు. ఇక ఈమూవీకి పూజా హెగ్డే పార్టీ సాంగ్‌ హైలెట్ కానుంది. తమన్నాతో పాటు పోటీపడి ఈ సినిమాలో మోహరిన్ నట విశ్వరూపం చూపించబోతోంది. 

click me!

Recommended Stories