ఇక తను వర్క్ చేసిన హీరోలలో ఎవరు కంఫర్ట్ అంటే.. హీరోలంతా తనకు ప్రత్యేకమే అంటోంది పూజా హెగ్డే. విజయ్‌తో బీస్ట్‌లో చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. అంత పెద్ద స్టార్ అయినా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. అల్లు అర్జున్, మహేశ్ బాబు, వరుణ్, ప్రభాస్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్.. ఇలా ఒక్కరేంటి నా కోస్టార్స్ అందరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నానంటోంది.