దుబాయ్ వెలుగుల్లో కవ్విస్తున్న మెహ్రీన్ గ్లామర్... న్యూ ఇయర్ పార్టీలో కేక పుట్టిస్తున్న ఎఫ్ 2 బేబీ డ్రెస్!

Published : Jan 02, 2023, 11:24 AM ISTUpdated : Jan 02, 2023, 11:26 AM IST

న్యూ ఇయర్ వేడుకల్లో మెహ్రీన్ పిర్జాడా మెరిశారు. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు మెహ్రీన్ మిత్రులతో దుబాయ్ వెళ్లారు. తన సెలెబ్రేషన్స్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.   

PREV
17
దుబాయ్ వెలుగుల్లో కవ్విస్తున్న మెహ్రీన్ గ్లామర్... న్యూ ఇయర్ పార్టీలో కేక పుట్టిస్తున్న ఎఫ్ 2 బేబీ డ్రెస్!
Mehreen Pirzada


ఇక పార్టీ వేర్ లో మెహ్రీన్ గ్లామర్ కిరాక్ పుట్టిస్తుంది. మెహ్రీన్ టెంప్టింగ్ గ్లామర్ కి కుదేలవుతున్న కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్ ఫోటోలు వైరల్ చేస్తూ... అభిమానం చాటుకుంటున్నారు.  
 

27
Mehreen Pirzada

ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. తెలుగులో మునుపటి ఊపు తగ్గింది. మెహ్రీన్ లేటెస్ట్ రిలీజ్ ఎఫ్3 పర్లేదు అనిపించుకుంది. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసింది. ఓపెనింగ్స్ భారీగా రాబట్టిన ఎఫ్3 కొత్త చిత్రాల విడుదలతో కొంచెం నెమ్మదించింది. 

37
Mehreen Pirzada


పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం

47
Mehreen Pirzada


 స్పార్క్ పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. వీటితో పాటు ఓ కన్నడ చిత్రం చేస్తున్నారు. ఇది ఆమెకు కన్నడ డెబ్యూ కావడం విశేషం. 
 

57
Mehreen Pirzada


ఇక మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు. కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు.  

67
Mehreen Pirzada


మరలా ఫార్మ్ లోకి వచ్చిన మెహ్రీన్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. అదే క్రమంలో ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో మెహ్రీన్ గ్లామరస్ ఫొటో షూట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. కెరీర్ కోసం సన్నబడిన మెహ్రీన్ నాన్ స్టాప్ గ్లామర్ షోతో అలరిస్తున్నారు. 
 

77
Mehreen Pirzada


మెహ్రీన్ డెబ్యూ మూవీ కృష్ణగాడి వీర ప్రేమగాథ మంచి విజయం సాధించింది. అలాగే శర్వానంద్ కి జంటగా మెహ్రీన్ నటించిన మహానుభావుడు సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. చాలా గ్యాప్ తర్వాత ఎఫ్ 2 తో హిట్ కొట్టింది. 

click me!

Recommended Stories