2023లో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.. డ్యామేజ్ బాగా జరిగింది.. చిరు, ప్రభాస్, దేవరకొండ, నాని పరిస్థితి ఇదే

First Published Jan 2, 2023, 11:03 AM IST

స్టార్ హీరోలకు వరుసగా ఫ్లాపులు ఎదురవడం మంచిది కాదు. కొన్ని చిత్రాల వరకు క్రేజ్ పనిచేస్తుంది. ఆ తర్వాత కాపాడాల్సింది సక్సెస్ మాత్రమే. హీరోల గత చిత్రాలు పరాజయం చెందినప్పుడు.. తదుపరి చిత్రం చాలా ప్రతిష్టాత్మకం అవుతుంది.

టాలీవుడ్ లో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. స్టార్ హీరోలకు వరుసగా ఫ్లాపులు ఎదురవడం మంచిది కాదు. కొన్ని చిత్రాల వరకు క్రేజ్ పనిచేస్తుంది. ఆ తర్వాత కాపాడాల్సింది సక్సెస్ మాత్రమే. హీరోల గత చిత్రాలు పరాజయం చెందినప్పుడు.. తదుపరి చిత్రం చాలా ప్రతిష్టాత్మకం అవుతుంది. ఫ్యాన్స్ కంబ్యాక్ మూవీగా భావిస్తారు. అలా 2023లో సాలిడ్ హిట్ అందుకోవాల్సిన హీరోలు కొందరు ఉన్నారు. 

చిరంజీవి : 2022 చిరు అభిమానులకి బిగ్ డిస్సప్పాయింట్మెంట్. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా కుదేలైందో అందరికి తెలుసు. ఆచార్య తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ మూవీతో చిరు బాక్సాఫీస్ బద్దలైయ్యే హిట్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆచార్య పరాజయం నుంచి బయట పడడానికి, తాను ఇకపై ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో నిర్ణయం తీసుకునేందుకు వాల్తేరు వీరయ్య చిత్రం విజయం సాధించడం మెగాస్టార్ కి చాలా అవసరం. 

అక్కినేని బ్రదర్స్ : నాగ చైతన్యకి చివరగా థాంక్యూ రూపంలో మామూలు షాక్ తగల్లేదు. ఈ ఏడాది చైతు నుంచి కస్టడీ చిత్రం రాబోతోంది. చై ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇక అఖిల్ పరిస్థితి కూడా అంతే.. హిట్ కొట్టడం తప్ప మరో దారి లేదు. అఖిల్ గత చిత్రాల పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం సోసో గా ఆడింది. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కోసం అఖిల్ ఒళ్ళు హూనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ : బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో.. గత ఏడాది రిలీజైన రాధే శ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో అతడిపై వందల కోట్ల బిజినెస్ నడుస్తోంది. ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలు రాబోతున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ కి ఎలాంటి డోకా ఉండకూడదు అంటే నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాల్సిందే. 

విజయ్ దేవరకొండ: కనీవినీ ఎరుగని అంచనాలతో గత ఏడాది విజయ్ నుంచి వచ్చిన లైగర్ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ విమర్శలపాలయ్యాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల ఎఫెక్ట్ వల్లే క్రేజ్ కొనసాగుతోంది అనే కంప్లైంట్ ఉంది. వీటన్నింటికి సమాధానం చెప్పాలంటే విజయ్ ఈ ఏడాది విజయం అందుకోవాల్సిందే. ప్రస్తుతం విజయ్, సమంత జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. 

సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్: ఈ మెగా హీరోలు కూడా ఈ ఏడాది విజయం అందుకోవాలి. ప్రమాదం నుంచి కోలుకున్నాక సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ కి గత ఏడాది గని, ఎఫ్3 లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. 

రామ్ పోతినేని : ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ ఎనెర్జిటిక్ స్టార్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. గత ఏడాది వచ్చిన ది వారియర్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తనని మాస్ హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది అని రామ్ భావిస్తున్నాడు. 

నాని : నేచురల్ స్టార్ నానికి గత రెండేళ్లలో ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేదు. గత ఏడాది వచ్చిన అంటే సుందరానికీ చిత్రం సాఫ్ట్ మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా చేయలేకపోయింది. ఈ ఏడాది నాని నుంచి ఊరమాస్ చిత్రం రాబోతోంది. ప్రస్తుతం నాని దసరా చిత్రంలో నటిస్తున్నాడు. నాని మునుపటి జోరు అందుకోవాలంటే దసరా సాలిడ్ హిట్ గా నిలవాలి. 

click me!