స్లీవ్‌లెస్‌ గౌన్‌లో దీపావళి పటాసులా పేలిన మెహరీన్‌.. అదిరిపోయే పోజులకు కుర్రాళ్లు పండగ

Published : Oct 21, 2022, 07:11 PM ISTUpdated : Oct 22, 2022, 06:08 AM IST

హాట్‌ హీరోయిన్‌ మెహరీన్‌ తెలుగు తెరపై కనువిందు చేసింది. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. కొంత గ్యాప్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది.   

PREV
17
 స్లీవ్‌లెస్‌ గౌన్‌లో దీపావళి పటాసులా పేలిన మెహరీన్‌..  అదిరిపోయే పోజులకు కుర్రాళ్లు పండగ

మెహరీన్‌ చాలా గ్యాప్‌తో అభిమానులను అలరించేందుకు వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. లేటెస్ట్ ఫోటో షూట్‌తో హల్‌చల్‌ చేసింది. స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ట్రెడిషనల్‌ లుక్లో ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

27

స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో అదిరిపోయేలా పోజులిచ్చింది మెహరీన్‌. దీపావళి పండుగని ముందే తెచ్చిందా అనేట్టుగా ఆమె ఈ లేటెస్ట్ పోజులుండటం విశేషం. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. దీపావళి పటాసులా పేలుతున్న మెహరీన్‌ అని, ట్రెడిషనల్‌ లుక్‌లో మరింత హాట్‌ పోజులు అని కామెంట్లు చేస్తున్నారు.

37

టాలీవుడ్‌లో వేగంగా దూసుకొచ్చిన హీరోయిన్‌ మెహరీన్‌. అంతే వేగంగా టాలీవుడ్‌కి దూరమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 2016లో `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ పంజాబీ భామ. నానితో ఆడిపాడింది. హాట్‌ అందాలతో మెరిసింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. 
 

47

తెలుగులో వరుసగా `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్‌` చిత్రాలతో విజయాలు అందుకుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్ అందుకుంది. క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆమె హాట్‌ అందాలకు సక్సెస్‌ తోడవ్వడంతో మంచి అవకాశాలు క్యూ కట్టాయి. 
 

57

అదే సమయంలో తమిళం, హిందీ వైపు మొగ్గు చూపింది మెహరీన్‌. అటు తమిళంలోకి, ఇటు హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన విజయాలు దక్కలేదు. తెలుగులోనూ ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్‌ అయ్యింది. సక్సెస్‌ ఆనందంలో వచ్చిన ప్రతి ఆఫర్‌ చేసేసింది. అవన్నీ డిజప్పాయింట్‌ చేశాయి. 
 

67

`కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం` చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఎంత వేగంగా హిట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుందో, అంతే వేగంగా డౌన్ అయిపోయింది. ఈ క్రమంలో మెహరీన్‌కి `ఎఫ్‌2` సక్సెస్‌ పెద్ద బూస్ట్ ఇచ్చింది. కానీ మళ్లీ అదే జరిగింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ పరాజయం అయ్యాయి.
 

77

ఇటీవల `ఎఫ్‌3`తో మరోసారి విజయాన్ని అందుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడం బాధాకరం. ప్రస్తుతం మెహరీన్‌ `స్పార్క్` అనే బైలింగ్వల్‌ తోపాటు ఓ కన్నడ మూవీ చేస్తుంది. కానీ తెలుగులో పెద్ద సినిమాలేవి లేకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories