Naga Chaitanya : వాలెంటైన్స్ డే.. ‘బుజ్జితల్లి’ అంటూ సాయిపల్లవి కోసం నాగచైతన్య స్పెషల్ వీడియో!

First Published | Feb 14, 2024, 2:35 PM IST

వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య ఇంట్రెస్టింగ్ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు...  ‘బుజ్జితల్లి’ అంటూ తన మనస్సులోని మాటలను చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ వీడియో ఎవరికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవల సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు. తన రాబోయే చిత్రంతో బిజీగా ఉన్నారు. గత సినిమాలతో పోల్చితే సక్సెస్ కోసం ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక నాగచైతన్య నెట్టింట తనతంట తానుగా చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటారు. ప్రత్యేకమైన రోజుల్లో స్పందిస్తుంటారు. కానీ తన రాబోయే చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ఈ మధ్య కాలంలో తెగ సందడి చేస్తున్నారు. 


నాగచైతన్య - చందూ మొండేటి కాంబినేషన్ లో ‘తండేల్’ Thandel చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి Sai Pallavi నటిస్తోంది. మరోసారి చై, సాయిపల్లవి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా సినిమా నుంచి కూడా ఇంట్రెస్టింగ్ గా అప్డేట్స్ అందిస్తున్నారు. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్బంగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ నాగ చైతన్య ఓ వీడియోను విడుదల చేశారు. తండేల్ నుంచి వచ్చిన డైలాగ్ ను చై రిపీట్ చేశారు. 
 

‘బుజ్జితల్లి... వచ్చేస్తున్నావ్ కదె.. కాస్తా నవ్వవే..’ అంటూ లిప్ సింక్ వీడియోను రిలీజ్ చేశారు. అందుకు సాయిపల్లవి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ను పలికించింది. తండేల్ నుంచి ఈ వీడియోను పంచుకుంటూ ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే ‘తండేల్’ నుంచి వచ్చిన వాలెంటైన్స్ డే స్పెషల్ వీడియోలోనే చైతూ, సాయిపల్లవి ఆకట్టుకున్నారంటే... ఇక సినిమా వచ్చాక అద్భుతమే అంటున్నారు. ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

click me!