మేఘా ఆకాష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్..ఎంత రొమాంటిక్ గా ఉన్నాయో చూడండి..

First Published | Sep 15, 2024, 4:08 PM IST

హీరోయిన్ మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. 

హీరోయిన్ మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నేడు చెన్నైలో వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగబోతోంది. తాజాగా మేఘా ఆకాష్ తన వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది. 

ఈ ఫొటోస్ లో మేఘా ఆకాష్, సాయి విష్ణు ఎంతో అందంగా ఉన్నారు. కొత్త జంట చూడ ముచ్చటగా ఉంది. మేఘా ఆకాష్ మెరిసిపోతున్న చీరలో అందంగా కనిపిస్తోంది. వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరుస్తున్నారు. 


వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా, ప్రేమ ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. మేఘా ఆకాష్ తన వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ని కూడా ఆహ్వానించారు. 

మేఘా ఆకాష్ వయసు 28 ఏళ్ళు. కొందరు హీరోయిన్లు 40 ఏళ్ళు సమీపిస్తున్నా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. ఇంకా చాలా కెరీర్ ఉన్న మేఘా ఆకాష్ మాత్రం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. 

అయితే మేఘా ఆకాష్ పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.  లై చిత్రం ఫ్లాప్ అయినా తర్వాత వెంటనే మరోసారి నితిన్ తో నటించే ఛాన్స్ అందుకుంది మేఘా ఆకాష్. చల్ మోహన్ రంగ చిత్రంలో మళ్ళీ నటించారు. ఆ మూవీ కూడా నిరాశపరిచింది.

Latest Videos

click me!