మెగాస్టార్ చిరంజీవి.. శ్రుతీహాసన్ జంటగా.. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిచారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వస్తోన్న ఈసినిమా ఈరోజు ( 13జనవరి ) సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ చూసిన జనాలు సినిమాపై తమ అభిప్రాయాలు ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు.