WaltairVeerayya Review:'వాల్తేరు వీరయ్య' ప్రీమియర్ టాక్.. వింటేజ్ మెగాస్టార్ తో పూనకాలు లోడింగ్, కానీ షరతులు

First Published Jan 13, 2023, 4:38 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది ట్రైలర్, సాంగ్స్ కూడా చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే అంచనాలు పెంచాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది ట్రైలర్, సాంగ్స్ కూడా చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే అంచనాలు పెంచాయి. ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీనితో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. 

రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. అలాగే బాబీ సింహా ఎంట్రీ కూడా ఉంటుంది. వాల్తేరులో ఇండియన్ నేవీ ఆఫీసర్స్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ మాస్ గా ఉంటూ ఆకట్టుకుంది. వెంటనే ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో ఊహించినట్లుగానే చిరంజీవి తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. సాంగ్ చిత్రీకరించిన విధానం కూడా బావుంటుంది. 

ఆ తర్వాత కథ మలేషియాకి మారుతుంది. చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మలేషియాలోని హీరోయిన్ శృతి హాసన్ పరిచయం అవుతుంది. ఇంటర్వెల్ వరకు ఈ చిత్రం అక్కడడక్కడ కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ సన్నివేశాలతో యావరేజ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ లోనే పూనకాలు లోడింగ్ మూమెంట్ వస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చారు. ఆయన లుక్స్, మ్యానరిజమ్స్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి. 

కథ యావరేజ్ గా ఉన్నప్పటికీ బిట్స్ బిట్స్ గా సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి. కొన్ని సీన్స్ ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తాయని ప్రేక్షకులు అంటున్నారు. కొంతమంది ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చిరంజీవి మ్యానరిజమ్స్ గుర్తుకు వస్తున్నాయి అని అంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి బాడీ లాంగ్వేల్ అలాగే ఉంటుంది. 

ఇక సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీ ఉంటుంది. పూనకాలు లోడింగ్ సాంగ్ లో చిరంజీవి, రవితేజని సింగిల్ ఫ్రేమ్ లో చూడడం మాస్ ఆడియన్స్ కి పండగే. కథలో ఆసక్తికర ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంటాయి. కామెడీ మాత్రం అన్నిసార్లు వర్క్ కావడం లేదు. దేవిశ్రీ ప్రసాద్ మంచి బిజియం అందించారు. 

వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి డ్యాన్స్, రవితేజ సన్నివేశాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా హైలైట్ ఐంది అని అంటున్నారు. రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు సెంటిమెంట్ వర్కౌట్ ఐంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నపటికీ సెకండ్ హాఫ్ చిత్రాన్ని నిలబెట్టింది అని ప్రీమియర్స్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. 

మొత్తంగా సంక్రాంతి సీజన్ లో వాల్తేరు వీరయ్య చిత్రం డీసెంట్ మూవీ అని అంటున్నారు. ఫ్యాన్స్ కి ఓకే కానీ కామన్ ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో పూనకాలు లోడింగ్ కాలేదు అని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 

click me!