CM Revanth Reddy
టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇది అత్యంత కీలకమైన భేటీ. చిరంజీవి హాజరు కాకపోవడానికి వినిపిస్తున్న కారణం ఆయన హైదరాబాద్ లో అందుబాటులో లేరు. చెన్నైలో షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయారని అంటున్నారు.
కానీ చిరంజీవి.. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి హాజరు కాకపోవడానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న రూమర్స్. చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. కానీ చివరికి చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి చిరు రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
Chiranjeevi
కానీ పవన్ నిర్ణయం మార్చుకుని నాగబాబుకి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేలా చేశారు. దీనితో చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి, ఆ తర్వాత మంత్రి పదవిని కూడా కట్టబెట్టే ఆలోచన ఉందట. అందువల్లే చిరంజీవి కూడా సైలెంట్ గా రేవంత్ రెడ్డితో మీటింగ్ కి దూరం అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోడీ.. వేదికపై చిరంజీవికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో చూశాం. చిరు, పవన్ అన్నదమ్ముల చేయి పట్టుకుని మోడీ అభివాదం చేసిన దృశ్యాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ప్రతి అంశానికి ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లడం పవన్ కి నచ్చడం లేదని టాక్. తన సోదరుడి స్థాయికి, హుందాతనానికి అది దెబ్బ అని పవన్ భావిస్తున్నారు. గతంలో చిత్ర పరిశ్రమ తరుపున చిరంజీవి జగన్ తో భేటీ అయ్యారు. ఆ సంఘటనతో చిరంజీవి అభిమానులు బాధపడ్డారు. పవన్ సైతం పలు సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా చిరంజీవి నిజంగానే రాజ్యసభ్య ఎంపీ కాబోతున్నారా ? ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.