బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో కూడా సంచలనంగా మారింది ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్.. రెండు సీజన్లు రిలీజ్ అవ్వగా.. రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి లీడ్ రోల్స్ చేసిన ఈవెబ్ సిరీస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు సీజన్ల తరువాత కూడా మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదరుచూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు సబంధించి ప్రియమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.