డిప్రెషన్ లో ఉన్న హీరోని.. పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి, మెగాస్టార్ దెబ్బకు మళ్లీ సెట్ అయిన హీరో ఎవరు?

Published : Apr 03, 2026, 07:40 AM IST

టాలీవుడ్ లో మెగాస్టార్ ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయినవారు ఎందరో ఉన్నారు. వారిలో ఒక హీరో డిఫ్రెషన్ లోకి వెళ్తే.. చిరంజీవి ఇంటికి పిలిచి మరీ క్లాస్ పీకారట. మెగా దెబ్బకు మళ్లీ సెట్ అయిన ఆ హీరో ఎవరో తెలుసా?

PREV
16
స్టార్ హీరోలకు మెగాస్టార్ ఇన్‌స్పిరేషన్

టాలీవుడ్ లో చాలామంది యాక్టర్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్‌స్పిరేషన్. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని చాలామంది హీరోలు టాలీవుడ్ కు వచ్చారు. అందులో సక్సెస్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల తాకిడిని తట్టుకుని నిలబడ్డాడు చిరంజీవి. ఆతరువాత కాలంలో వచ్చిన హీరోలను కూడా అదిగమించి.. మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఈక్రమంలో ఆయన గెలుపోటములకు ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. అందుకే చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు.

26
ఫ్యామిలీ హీరోగా రాణించిన శ్రీకాంత్..

మరీ ముఖ్యంగా శ్రీకాంత్, సునిల్, రవితేజ, లాంటి స్టార్స్ చిరంజీవిని ఇన్‌స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చినవారే. వారిలో హీరో శ్రీకాంత్ మాత్రం మెగాస్టార్ ను అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. ఎప్పుడు వీలు కుదిరినా.. చిరంజీవిని కలిసి మాట్లాడటం, నెలకు ఒక్కసారైనా చిరంజీవిని చూడకుండా ఉండేవారు కాదట.

 టాలీవుడ్ లో శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా ఎదిగాడు. విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన.. ఆతరువాత ఫ్యామిలీ హీరోగా వరుస విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా మహిళా అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ సినిమా రిలీజ్ అయ్యిందంటే.. థియేటర్లలో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయేవి.

36
వరుస ఫెయిల్యూర్స్ రావడంతో డిప్రెషన్ లోకి..

అలా టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను శ్రీకాంత్ క్రియేట్ చేసుకున్నాడు. అటువంటి హీరోకి ఒకానొక టైమ్ లో వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయి. ఇబ్బంది పెట్టాయి. వరుసగా దాదాపు 7 సినిమాలు కొన్నిప్లాప్ లు, కొన్ని యావరేజ్ గా నిలిచాయి. వరుసగా పెద్ద బ్యానర్ లో చేసిన సినిమాలన్నీ పోయాయి. ఆ టైమ్ లో శ్రీకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లారు. బయటకు వెళ్లడం కూడా తగ్గించారు. 

ఇక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. ఈక్రమంలోనే దాదాపు 3 నెలలు అస్సలు బయటకు రాలేదు. నెలలో రెండు మూడు సార్లు అయినా చిరంజీవిని కలిసేవారు శ్రీకాంత్. కానీ మూడు నెలలుగా అసలు ఆయన కనిపించకపోవడంతో.. చిరంజీవికి అనుమానం వచ్చింది. వెంటనే శ్రీకాంత్ కు కబురు వెళ్లింది.. చిరంజీవిగారు కలవమన్నారని.

46
షూటింగ్ ఆపేసిన మెగాస్టార్..

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా ష‌ూటింగ్ జరుగుతోంది. సాంగ్ షూట్ చేయాలి. అప్పుడే శ్రీకాంత్ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆ సాంగ్ షూటింగ్ ను ఆపేసి.. ఓ గంట తరువాత వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి.. శ్రీకాంత్ ను ఓ రూమ్ లోకి తీసుకెళ్లారు మెగాస్టార్. 

ఇప్పుడు చెప్పు.. ఏమైపోయావు.. ఎందుకు అలా అయ్యావు.. కలవడంలేదు. ఏంటి రా ప్రాబ్లమ్ అని అడిగారు. అప్పుడు శ్రీకాంత్.. ''ఇది పరిస్థితి...వరుస ఫెయిల్యూస్స్ తో డిప్రెషన్ లోకి వెళ్ళాను.. ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామనుకుంటున్నాను అన్నయ్య'' అని అన్నారు.

56
శ్రీకాంత్ కు క్లాస్ పీకిన చిరంజీవి..

శ్రీకాంత్ చెప్పినదంతా విని మెగాస్టార్ వెంటనే ..'' పిచ్చొడ.. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి. వాటిని అంత సీరియస్ గా తీసుకుంటే ఎదగలేరు. ఇండస్ట్రీలోకి రావడమే మన చేతుల్లో ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చానంటే..మెగాస్టార్ అయిపోతాని రాలేదు.. మన కష్టాన్నినమ్ముకుని.. కష్టపడుతూనే ఉంటాం.. రూట్ అదే తీసుకెళ్తుంది.. నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్న వచ్చావు కదా.. అప్పుడు అన్నింటిని తీసుకోవాలి.. సక్సెస్ మాత్రమే తీసుకుంటాను.. అంటే ఎలా'' అని ఆయన జీవితంలో జరిగిన విజయాలను కొన్నింటిని చెప్పారు. దాంతో చిరంజీవి చెప్పిన కొన్ని విషయాలు శ్రీకాంత్ పై బాగా ప్రభావం చూపించాయి.

66
ప్రస్తుతం శ్రీకాంత్ ఏం చేస్తున్నాడు?

ఆ రోజు నుంచి సక్సెస్ ను ఫెయిల్యూర్ ను ఒకేలా తీసుకోవడం మొదలు పెట్టాడు. అన్నింటికి ఒకటే స్పందన. ఫెయిల్యూర్ వచ్చిందని కృంగిపోవడం లేదు.. సక్సెస్ వచ్చిందని ఎగిరిపడటం లేదు. ఇక ఈ విషయాలను శ్రీకాంత్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఇక ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా సినిమాలు లేకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్నారు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా కనిపించారు. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ.. ఇండస్ట్రీలో మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడు శ్రీకాంత్.

click me!

Recommended Stories