నాకు, పవన్ కి, చరణ్ కి గుణపాఠాలు నేర్పిన చిత్రాలు అవే.. అలాంటివాటి జోలికి వెళ్ళకూడదు, చిరు కామెంట్స్ 

First Published Jun 26, 2024, 5:00 PM IST

పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ ముందు వరకు విజయం లేదు. ఈ విషయాన్ని గతంలో చిరంజీవి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవికి కూడా కెరీర్ లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు ఖైదీ చిత్రంతో వచ్చిన క్రేజ్ తో తార జువ్వ లాగా దూసుకుపోయారు. ఒక దశలో చిరు సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. 

అయితే ఆ తర్వాత బిగ్ బాస్, ఎస్పీ పరశురామ్ లాంటి చిత్రాలు దారుణంగా పరాజయం చెందాయి. దీనితో చిరు స్పీడుకి బ్రేకులు పడ్డట్లు అయింది. ప్రతి హీరోకి కెరీర్ లో సెట్ బ్యాక్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ ముందు వరకు విజయం లేదు. 

Latest Videos


ఈ విషయాన్ని గతంలో చిరంజీవి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ వేదికగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమ ఫ్యామిలీకి అవార్డుల కంటే అభిమానుల సంతోషమే ముఖ్యమని చిరంజీవి అన్నారు. హిట్లర్ ముందు కొన్ని చిత్రాలు చేశాను. అవి నానా అభిమానులకు నచ్చలేదు. ఇక  జోలికి వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. 

అభిమానులు నచ్చే అంశాలు పెడుతూ సినిమాలు చేశాను. నా సెకండ్ ఇన్నింగ్స్  చూశారు. ఇక పవన్.. ప్రతి చిత్రంలో వైవిధ్యం ఉండాలని కోరుకునే వ్యక్తి. ఖుషి వరకు అన్ని వర్కౌట్ అయ్యాయి. కానీ ఖుషి తర్వాత మిమ్మల్ని పవన్ చిత్రాలు మెప్పించలేక పోయాయి. అవన్నీ బ్యాడ్ మూవీస్ కాదు. 

కానీ ఎందుకో ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఆ చిత్రాలు రాలేదు. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అని చిరు ఆడియో రిలీజ్ లోనే తెలిపారు. గబ్బర్ సింగ్ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. 

అదే విధంగా చిరు రాంచరణ్ గురించి కూడా మాట్లాడారు. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత ఫ్యాన్స్ చరణ్ నుంచి అంతే భారీ చిత్రాలు కోరుకుంటారు. కథలు దొరకడం కష్టం అవుతుంది నాన్న అని చరణ్ అన్నాడు. దీనితో ఫ్యాన్స్ అంచనాలని తగ్గించడానికి ఓకే రొమాంటిక్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అనిఆరెంజ్ మూవీ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. 

భారీ చిత్రాలు కాకపోయినా ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందని రచ్చ మూవీ నిరూపించింది అని చిరు అన్నారు. ఇవన్నీ నాకు, పవన్ కి, చరణ్ కి కెరీర్ లో గుణపాఠాలు నేర్పిన సందర్భాలు అని చిరంజీవి అన్నారు. 

click me!