ఇటీవల భానుప్రియ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా అరుదుగానే మెరుస్తున్నారని చెప్పొచ్చు. ఆమెకి ఆఫర్లు తక్కువ కావడమో, లేక తను సెలక్టీవ్‌గా ఉండటమోగానీ, ఏడాదికి ఒకటి అర మాత్రమే కనిపిస్తుంది భాను ప్రియ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ క్లిప్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఆమె చెప్పిన విషయాలు వైరల్‌గా మారుతున్నాయి.
భానుప్రియ లవ్ స్టోరీ హాట్ టాపిక్ అవుతుంది. భానుప్రియా కమర్షియల్ సినిమాలు, డివోషనల్ మూవీస్ చేసింది. అందులో భాగంగా దర్శకుడు వంశీతో కలిసి చాలా సినిమాలే చేసింది. దీంతో దర్శకుడితో మంచి అనుబంధం, అది ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి ప్రేమ అప్పట్లో పెద్ద సంచలనంగా మారిందట. పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యింది.
దర్శకుడు వంశీకి ఆల్‌రెడీ పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్ద వాళ్లతో మాట్లాడాడు. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ. దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట. ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది.
అంతేకాదు భానుప్రియని కట్టడి చేసిందట. అతనికి ఆల్‌రెడీ మ్యారేజ్ అయ్యింది. పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేంటి అని మందలించిందట అమ్మా. ఏమాత్రం సహించలేదని చెప్పింది భానుప్రియా. అమ్మ కారణంగానే ఆ మ్యారేజ్ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ. అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తుందని వెల్లడించింది భానుప్రియ. అలా భానుప్రియతో దర్శకుడు వంశీ రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్ అయ్యింది.
ఆ తర్వాత భానుప్రియ.. 1998లో డిజిటల్ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్‌ని వివాహం చేసుకుంది. కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్ జరిగింది. వీరికి కూతురు అభినయ ఉంది. అయితే భానుప్రియ భర్త ఆదర్శ్ 2018లో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తుంది.
భానుప్రియ నటించిన `సితార` విశేష ఆదరణ పొందింది. దీనికి దర్శకుడు వంశీ కావడం విశేషం. ఆ తర్వాత `అన్వేషణ`, `విజేత`, `దొంగమొగుడు`, `జేబుదొంగ`, `స్వర్ణకమలం`, `ఖైదీ నెం 786`, `స్టేట్ రౌడీ` వంటి వంటి వందల చిత్రాల్లో నటించింది. ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, సుమన్, రాజేంద్రప్రసాద్ వంటి వారితో కలిసి నటించింది. స్టార్ హీరోయిన్‌గా వెలిగింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మళ్లీ తిరిగి 2003లో అమెరికా నుండి తిరిగి వచ్చేసిన భానుప్రియ మళ్ళీ నటించడం మొదలుపెట్టారు. `గౌతమ్ ఎస్ ఎస్ సి`, `ఛత్రపతి`, `చినబాబు` తదితర చిత్రాల్లో తల్లి, వదిన పాత్రల్లో నటించారు. చివరగా ఆమె `మహానటి`, `నాట్యం` చిత్రాల్లో మెరిసింది.