స్టేజ్‌పైకి పిలిచి మరీ యాంకర్‌ రష్మి పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్‌.. నోరు తిరక్క నవ్వులపాలు

Published : Apr 03, 2024, 11:14 PM IST

యాంకర్‌ రష్మి ఆ మధ్యనే ప్రాసలకు పోయి పరువు పోగొట్టుకుంది. అయితే ఈ సారి జబర్దస్త్ కమెడియన్‌ పనిగట్టుకుని రష్మి గౌతమ్‌ పరువు తీయడం గమనార్హం.   

PREV
16
స్టేజ్‌పైకి పిలిచి మరీ యాంకర్‌ రష్మి పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్‌.. నోరు తిరక్క నవ్వులపాలు
extra jabardasth promo

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. ఇటీవల సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె పెళ్లి విషయాలు, ఆమె కొంటె చేష్టలు అందరిని అలరిస్తున్నాయి. అదే సమయంలో కంటెంట్‌కి మూలం అవుతున్నాయి. ఆ మధ్య ప్రాసలకు పోయి పరువుపోగొట్టుకుంది రష్మి గౌతమ్‌. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

26
extra jabardasth promo

ఇప్పుడు జబర్దస్త్ లేడీ కమేడియన్‌ ఇచ్చిన దెబ్బకి రష్మికి మతిపోయింది. స్టేజ్‌పైకి పిలిచి మరీ రష్మి పరువు తీయడం గమనార్హం. నోరు తిరక్క రష్మి సైతం నవ్వులపాలయ్యింది. మరి ఇంతకి ఏం జరిగింది, ఎందుకు కామెడీ అయ్యిందనేది చూస్తే, 
 

36
extra jabardasth promo

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో `ఆది` స్కిట్‌తో అలరించాడు ఇమ్మాన్యుయెల్‌. అలాగే భాస్కర్‌ కూడా తనదైన స్టయిల్‌లో రచ్చ చేశాడు. ఈ క్రమంలో జబర్దస్త్ లేడీ కమెడియన్‌ రోహిణి.. తెలుగు టీచర్‌ స్కిట్‌ని ప్రదర్శించింది. ఇందులో టెంన్త్ క్లాస్‌లో వచ్చే ప్రవరుని స్వాగతం కి సంబంధించిన పద్యాన్ని చదివి వినిపించింది రోహిణి. 
 

46
extra jabardasth promo

చాలా క్లిష్టమైన ఆ పద్యం చదవడానికి నోరు తిరగడమంటే చాలా కష్టం. కానీ రోహిణి ఈజీగా చదివేసింది. ఊపిరితీసుకోకుండా ప్రారంభం నుంచి చివరి వరకు చెప్పి వాహ్‌ అనిపించింది. అయితే ఆ పద్యం చదవడానికి ముందు యాంకర్‌ రష్మిని స్టేజ్‌పైకి పిలిచింది. ఆమె సమక్షంలోనే ఆ పద్యం చదివింది. రోహిణి అంత అనర్గళంగా ఆ పద్యం చెప్పడంతో రష్మికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఆమెకి దెండం పెట్టి వెళ్లిపోయింది. 
 

56
extra jabardasth promo

అయితే రష్మిని రోహిణి వదల్లేదు. ఆమెని మళ్లీ స్టేజ్‌పైకి పిలిచింది. ఆ పద్యంలోని రెండో వ్యాఖ్యం చదవాలని చెప్పింది. చదివి వినిపించింది. రష్మి కూడా సాహసం చేసింది. చదవలేక చదివి నవ్వులపాలు అయ్యింది. ఆమె పదాలను పలికిన తీరుకి అంతా ఘోళ్లున నవ్వారు. అంతేకాదు ఆ మధ్య ఉల్లాసంగా, ఉత్సాహంగా అనమంటే లంగా, లెహంగా అన్నదని చెప్పి రష్మి పరువు మరోసారి తీసింది రోహిణి. 
 

66

ఈ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఆ మధ్య యాంకర్‌ రష్మి కాస్త డల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏదో రూపంలో కంటెంట్‌ ఇస్తూ అలరిస్తుంది. ఎంగేజ్‌ చేస్తుంది. షోకి క్రేజ్‌ని తీసుకురావడంలో తనవంతు భాగం అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories