ఎందరితో నటించినా ఆ హీరోయిన్ నా ఫేవరేట్, అందుకే దాసోహం... చిరంజీవి అంతగా ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా?

First Published | Sep 13, 2024, 9:41 AM IST

చిరంజీవి సుధీర్ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. కానీ ఆయన ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్ మాత్రం ఒకరేనట. చిరంజీవి దాసోహం అన్న హీరోయిన్ ఎవరంటే?
 

Chiranjeevi

నటుడిగా చిరంజీవిది నాలుగు దశాబ్దాలకు పైగా ప్రస్థానం. ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978లో విడుదలైంది. అందివచ్చిన పాత్రలు చేసుకుంటూ అంచెలంచెలుగా చిరంజీవి ఎదిగారు. టాలీవుడ్ నెంబర్ హీరో స్థానం అందుకున్నారు. ఈ ప్రస్థానంలో చిరంజీవి అనేక మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

150కి పైగా చిత్రాల్లో పదుల సంఖ్యలో హీరోయిన్స్ తో చిరంజీవి పని చేశారు. జత కట్టిన హీరోయిన్స్ లో ఎవరంటే చిరంజీవికి ఇష్టం?. ఈ ప్రశ్నకు చిరంజీవి ఓ సందర్భంలో స్వయంగా సమాధానం చెప్పాడు. గతంలో తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీరు నటించిన హీరోయిన్స్ లో ఆల్ టైం ఫేవరేట్ ఎవరని చిరంజీవిని యాంకర్ అడిగారు. 
 

Chiranjeevi

చిరంజీవి మాట్లాడుతూ.. నేను నటించిన హీరోయిన్స్ లో ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీకి నేను అభిమానిని. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో నిష్ణాతులు. రాధ గురించి చెప్పాలంటే ఆమె డాన్స్ అద్భుతంగా ఉంటుంది. శ్రీదేవి గారు ఓవరాల్ పర్సనాలిటీ పరంగా గొప్పవారు. సుమలత హోమ్లీ రోల్స్ కి పెట్టింది పేరు. అలాగే సుహాసిని మరో కోణంలో గొప్ప. 
 


Chiranjeevi

ప్రతి హీరోయిన్ లో ఇలా ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీకి నేను దాసోహం. అయితే మహానటి సావిత్రి, జయసుధ, వాణిశ్రీ తర్వాత విలక్షణత కలిగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రాధిక, ఆమె ఎమోషన్స్, కామెడీ, క్లాస్, మాస్... అన్ని రకాల పాత్రలు చేయగలదు. వైవిధ్యం చూపించగలదు. అందుకే నాకు ఇష్టమైన హీరోయిన్ రాధిక, అన్నారు. 
 

Chiranjeevi

కాబట్టి చిరంజీవి ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్ రాధిక అన్నమాట. చిరంజీవి-రాధిక కాంబోలో అనేక చిత్రాలు తెరకెక్కాయి. అభిలాష, దొంగ మొగుడు, న్యాయం కావాలి, పట్నం వచ్చిన పతివ్రతలు వాటిలో మచ్చుకు కొన్ని. చిరంజీవి తన హీరోయిన్స్ తో అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు. నైంటీస్ హీరోలు, హీరోయిన్స్ గతంలో ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. 
 


ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. 

విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సురభి, ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తరహాలో చిరంజీవి పాత్ర ఉంటుందట. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇది ఒకింత వివాదాస్పదమైంది. విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Videos

click me!