ఒక క్యారెక్టర్ లో ఇన్ని షేడ్షా! అంతలోనే బ్రేకప్ అండ్ లింకప్!

First Published | Sep 13, 2024, 8:01 AM IST

నీ వల్లే నా గేమ్ పాడవుతుందని నిఖిల్ ని ఛీ కొట్టిన సోనియా, అతడు టాస్క్స్ గెలిచి ప్రైజ్ మనీ పెంచుకోవడంతో వచ్చి చేయి పట్టుకుని కూల్ చేసింది. ఇవన్నీ గమనిస్తున్న ఆడియన్స్ సోనియాలో మస్తు షేడ్స్ ఉన్నాయని అంటున్నారు. 
 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ హౌస్లో తెలుగు అమ్మాయి సోనియా ఆకుల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె గేమ్, మాటలు, చర్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. సోనియా మొదటి నుండి విష్ణుప్రియను టార్గెట్ చేస్తుంది. విష్ణుప్రియ డ్రెస్సింగ్, జోక్స్ పై ఘాటైన విమర్శలు చేసింది. అది ఆమెకే మైనస్ అయ్యింది. 

Bigg Boss Telugu 8

విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదంటూ సోనియా వ్యక్తిగత విమర్శలు చేయడం ఆడియన్స్ కి నచ్చలేదు. సోనియా ఆకుల ఇతర కంటెస్టెంట్స్ ని జడ్జి చేయడం ఆపేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రియపై మరోసారి సోనియా అనుచిత కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ పంపుల దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళలా గలీజ్ గా రెచ్చ గొడుతుంది, అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 
 


Bigg Boss Telugu 8

అభయ్, యాష్మి గౌడలతో విష్ణుప్రియను కించపరుస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ వీక్ మొత్తం నిఖిల్ తో రాసుకుపూసుకు తిరిగింది. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఆడియన్స్ భావించారు. ఎలిమినేటైన బెజవాడ బేబక్క సైతం దీన్ని నిర్ధారించింది. నిఖిల్-సోనియా సన్నిహితంగా ఉంటారని హౌస్లో ఉన్న వారందరికీ తెలుసని బేబక్క అన్నారు. 

Bigg Boss Telugu 8

కాగా సెకండ్ వీక్ లో నిఖిల్ కి ఆమె ఝలక్ ఇచ్చింది. నువ్వు లూజర్, నీ వలన నా గేమ్ పదవుతుందంటూ తన మాటలతో ఎమోషనల్ గా డ్యామేజ్ చేసింది. ఆమెకు కనెక్ట్ అయిన నిఖిల్ ఈ మాటలు తీసుకోలేకపోయారు. ఆమె పదే పదే లూజర్ అంటుంటే ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అని యాష్మి గౌడ నిఖిల్ ని తిట్టింది. 

Bigg Boss Telugu 8

నిఖిల్ ని అంతగా హేట్ చేసిన సోనియా నిన్న మరలా కొత్తగా బిహేవ్ చేసింది. బిగ్ బాస్ నిర్వహించిన మూడు టాస్క్ లలో నిఖిల్ సత్తా చాటాడు. అతడి క్లాన్ వద్ద అత్యధికంగా రూ. 2.45 లక్షల ప్రైజ్ మనీ ఉంది. యాష్మి గౌడ వద్ద రూ. 1.25 లక్షలు, నైనిక వద్ద రూ. 1 లక్ష ఉన్నాయి. నిఖిల్ వరుస విజయాలతో దూసుకుపోయాడు. నిన్న లూజర్ అని నిందించిన సోనియా ఒపీనియన్ మారిపోయింది. నిఖిల్ వద్దకు వెళ్లి చేయి పట్టుకుని ఐస్ పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. 

అప్పటికప్పుడు మనుషులపై తన అభిప్రాయాలు మార్చేసుకుంటున్న సోనియాలో మస్త్ షేడ్స్ ఉన్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కంటెస్టెంట్ పృథ్విరాజ్ తో కూడా సోనియా సన్నిహితంగా ఉంటుంది. ఇదంతా సోనియా గేమ్ స్ట్రాటజీలో భాగమే అని చెప్పాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఆమె మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆత్మవిశ్వాసం దెబ్బ తీస్తే గేమ్ సరిగా ఆడలేరు. అదే సోనియా ప్రణాళిక అనే వాదన వినిపిస్తోంది. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sonia Akula

సోనియా గేమ్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.   ఆమెను ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. అయితే బిగ్ బాస్ మేకర్స్ కి కావాల్సింది ఇలాంటి కంటెస్టెంట్స్. తప్పో ఒప్పో... తమ చర్యల ద్వారా గేమ్ ని ఆసక్తికరంగా మార్చే వారిని త్వరగా ఎలిమినేట్ చేయరు. 

గతంలో మోనాల్ గజ్జర్, శ్రీసత్య, సిరి హన్మంత్, శోభా శెట్టి వంటి కంటెస్టెంట్స్ తీవ్ర నెగిటివిటీ ఎదుర్కొన్నారు. కానీ వీరందరూ షోలో చివరి వరకు ఉన్నారు. కొందరు ఫైనల్ కి కూడా వెళ్లారు. సోనియా ఆకుల సైతం హౌస్లో 10 వారాలకు మించి ఉంటుందనడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!