కొద్దిసేపటి క్రితమే విడుదలైన రిపబ్లిక్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు నటన హైలైట్ కాబోతోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై దేవ కట్టా సంధించిన అస్త్రమే ఈ రిపబ్లిక్. జెబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్ లాంచ్ లో తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొన్నాడు.