చిరంజీవి, మణిరత్నం కాంబోలో ఒక్క మూవీ కూడా రాలేదు. కానీ చిరంజీవి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మణిరత్నం తన ఐకానిక్ మూవీలో ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ విషయాన్ని సుహాసిని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 80వ దశకం నుంచి తెలుగు సినిమాని శాసించడం ప్రారంభించారు. చిరంజీవి క్రేజ్ ని ఇతర హీరోల సినిమాల్లో కూడా వాడుకుంటూ ఉంటారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. 90వ దశకంలోనే లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తన ఐకానిక్ మూవీ ఇరువర్ (ఇద్దరు) చిత్రంలో చిరంజీవి క్రేజ్ ని వాడుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన మాస్టర్ పీస్ చిత్రాల్లో ఇరువర్ ఒకటి.
25
ఇరువర్ మూవీలో ఐకానిక్ సీన్
ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్యారాయ్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ టెర్రస్ పైన నిలబడి ప్రజలకు అభివాదం చేసే ఐకానిక్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశానికి స్ఫూర్తి చిరంజీవి అని సుహాసిని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనివెనుక ఉన్న అసలు స్టోరీనే సుహాసిని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
35
తిరుపతిలో చిరు క్రేజ్ కి హీరోయిన్ మైండ్ బ్లాక్
నేను, చిరంజీవి ఒకసారి 100 డేస్ ఫంక్షన్ కోసం తిరుపతికి వెళ్లాం. ఆ టైంలో నేను చిరుని బాగా ఆటపట్టించేదాన్ని. నేను స్టార్ ని నువ్వు నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చిరంజీవి సరదాగా అన్నారు. నువ్వు పెద్ద స్టార్ ఏంటి, నువ్వు నా కో స్టార్ మాత్రమే అని చెప్పాను. అవునా అయితే నాతో రా అని చిరు టెర్రస్ మీదికి తీసుకువెళ్లాడు. టెర్రస్ పైన నిలబడి చూస్తే తిరుపతిలో ఉన్న జనం మొత్తం అక్కడే ఉన్నారు. చిరంజీవి కోసం కేరింతలు కొడుతున్నారు. అది చూసి ఆశ్చర్యపోయాను అని సుహాసిని పేర్కొంది.
అప్పుడు నాకు వెంటనే ఇలాంటి సీన్ ఒక సినిమాలో ఉండాలి అని అనిపించింది. సరైన టైం చూసి మణిరత్నం గారికి చిరంజీవితో తిరుపతిలో జరిగిన సంఘటన గురించి, ఆయన క్రేజ్ గురించి చెప్పాను. అప్పడు ఆయన ఇరువర్ చిత్రంలో టెర్రస్ సీన్ ని క్రియేట్ చేశారు అని సుహాసిని పేర్కొన్నారు.
55
బిగ్గెర్ దేన్ బచ్చన్
చిరంజీవి 90 వ దశకంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక టైంలో బిగ్గెర్ దేన్ బచ్చన్ అనే ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకే స్థాయికి చిరంజీవి ఎదిగారు.