Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్

Published : Jun 13, 2026, 10:00 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కామనర్స్ కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ ని ఇస్తున్నారు. అగ్నిపరీక్ష 2 సీజన్‌ షురూ అయ్యింది. దీనికి ఎంపికయ్యారంటే టైటిల్‌ గెలిచే ఛాన్స్ పక్కా. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 సందడి షురూ

బిగ్‌ బాస్‌ సందడి షురూ అయ్యింది. బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వహకులు. దీనికోసం హోస్ట్ నాగార్జున ఇప్పటికే రెడీ అయ్యారు. ఆయన బిగ్‌ బాస్‌ లవర్స్ లో ఊపు తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తున్నారు. మొన్న బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రోమో సాంగ్‌ ని విడుదల చేశారు. షో గురించి చెబుతూ, దాని ప్రత్యేకతని చెబుతూ, ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తుందో చెబుతూ ఈ పాట సాగింది. ఈ సారి ఎంటర్‌ టైన్‌మెంట్‌ వేరే లెవల్‌ అని తెలిపారు. అదే సమయంలో బిగ్‌ బాస్‌ దశావతారం అంటూ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశారు నాగార్జున.

25
కామన్‌ మ్యాన్‌కి బిగ్‌ బాస్‌ ఛాన్స్

ఈ నేపథ్యంలో కామన్‌ మ్యాన్‌కి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. గత సీజన్‌లోనూ కామన్‌ మ్యాన్‌కి అవకాశం కల్పించింది. అందుకోసం `అగ్నిపరీక్ష` పేరుతో ప్రత్యేకంగా షోని నిర్వహిస్తుంది. ఇందులో కామన్‌ మ్యాన్‌లను కొంత మందిని ఎంపిక చేసి, వారిలో ఫిల్టర్‌ చేస్తుంది. ఫైనల్‌గా ఐదారుగురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేస్తుంటుంది. గత సీజన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లని మెయిన్‌ షోకి ఎంపిక చేసింది. అంతేకాదు కామన్‌ మ్యానే గత సీజన్‌లో విజేతగా నిలిచారు. కళ్యాణ్‌ పడాల అగ్నిపరీక్ష ద్వారా వచ్చి టైటిల్‌ విన్‌ అయిన విషయం తెలిసిందే.

35
అగ్నిపరీక్ష 2 షురూ

ఈ సారి కూడా అగ్నిపరీక్షకి పెద్ద పీఠ వేస్తున్నారు బిగ్‌ బాస్‌ నిర్వహకులు. ఈ సారి ఎక్కువ మంది కంటెస్టెంట్లని ఈ కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఎంపిక చేయబోతున్నారు. తాజాగా `అగ్నిపరీక్ష` సీజన్‌ 2 షురూ అయ్యింది. బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం కల్పించింది. అగ్నిపరీక్షకి కామనర్స్ ని ఆహ్వానించింది. శుక్రవారం(జూన్‌ 12) నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అధికారికంగా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. అప్లై చేసుకునే వెబ్‌ సైట్‌ డిటెయిల్స్ ని కూడా ప్రకటించారు. జూన్‌ 12 నుంచి జూన్‌ 20 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో ఆడిషన్‌కి సంబంధించిన వీడియోని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఎందుకు బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాలనుకుంటున్నారు? అనేది అందులో చెప్పాల్సి ఉంటుంది.

45
అగ్నిపరీక్షకి ఎంపికైతే టైటిల్‌ విన్నయ్యే ఛాన్స్

ఈ నెలాఖరులో వచ్చిన అప్లికేషన్స్ ని లిస్ట్ చేస్తారు, జులైలో ఫిల్టర్‌ చేయాల్సి ఉంటుంది. జులై ఎండింగ్‌, ఆగస్ట్ లో అగ్నిపరీక్షని నిర్వహిస్తారు. అందులోనుంచి మెయిన్‌ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ తెలుగు 10 సీజన్‌ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌ కూడా సెప్టెంబర్‌లోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే అగ్నిపరీక్షలో ఎంపికయ్యారంటే టైటిల్‌ విన్‌ అయ్యే ఛాన్స్ కామనర్స్ దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామనర్స్ ని టైటిల్‌ విన్నర్‌గా చేయడంతో బిగ్‌ బాస్‌ షో నిర్వహకులకు మంచి మైలేజ్‌ వస్తుంది. షోకి ఆదరణ పెరుగుతుంది. దీంతో చాలా వరకు కామనర్స్ నే విన్నర్‌ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సారి కామనర్స్ ని చేస్తారా? సెలబ్రిటీని విన్నర్‌ని చేస్తారా అనేది చూడాలి.

55
వినిపిస్తున్న సెలబ్రిటీ కంటెస్లెంట్ల లిస్ట్

ఇక సెలబ్రిటీ విభాగంలో ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రాబోతున్న వారిలో క్రేజీ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. తేజస్విని గౌడ, శివకుమార్‌, ఈటీవీ ప్రభాకర్‌గానీ, ఆయన కొడుకు చంద్రహాస్‌గానీ వచ్చే అవకాశం ఉందట. అలాగే పల్లవి గౌడ, ఎక్స్ ప్రెస్‌ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్‌ రాకేష్‌, నందూస్‌ వరల్డ్ నందూ, పండు మాస్టర్‌, ఆట సందీప్‌ భార్య జ్యోతి, రాయల్‌ మెక్‌ రమణ, వాసంతి కృష్ణన్‌ భర్త పవన్‌ కళ్యాణ్‌, రైటర్‌ కడలి సత్యనారాయణ, వంటి వారు వచ్చే ఛాన్స్ ఉందని టాక్‌. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories