మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. ఠాగూర్, స్వయంకృషి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా నిలిచాయి. అదే కోవకి చెందిన మరో చిత్రం స్టాలిన్. సాటిమనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయాలి.. ఒక్కొక్కరు ముగ్గురికి సాయం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి అనే పాయింట్ తో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.