ఆ బాబా వల్లే చిరంజీవి నెంబర్ 1 అయ్యారా..పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన మెగాస్టార్, కోపం వస్తే అంతే
సాయం అడిగితే వెంటనే స్పదించే చిరంజీవి తన పేరుని దుర్వినియోగం చేస్తే మాత్రం అసలు ఊరుకోరట.
సాయం అడిగితే వెంటనే స్పదించే చిరంజీవి తన పేరుని దుర్వినియోగం చేస్తే మాత్రం అసలు ఊరుకోరట.
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలపైగా టాలీవుడ్ లో తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు. 150 పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. సొంతంగా ఇండస్ట్రీలో ఎదిగి కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న ఘనత చిరంజీవిది. అంతటి స్టార్ డమ్ సాధించాక చిరంజీవి పేరుని మిస్ యూజ్ చేసుకోవాలి అనుకునే వారు కూడా ఉంటారు.
సాయం అడిగితే వెంటనే స్పదించే చిరంజీవి తన పేరుని దుర్వినియోగం చేస్తే మాత్రం అసలు ఊరుకోరట. ఒక మ్యాగజైన్ సంస్థ చిరంజీవి ఫోటోని కవర్ పేజీపై వేసుకుని లబ్ది పొందాలని చూసింది. వాళ్లకు చిరంజీవి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారట. చిరంజీవి ఫోటోని కవర్ పేజీపై వేస్తె తప్పేముంది అని అనుమానం కలగొచ్చు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఇండస్ట్రీలో చిరంజీవి నంబర్ 1 గా కొనసాగుతున్న సమయంలో ఆయన ఫోటో ముద్రించుకుని చాలా పత్రికలు లాభాలు పొందాలని చూసేవి. ఈ విషయాన్ని రచయిత తోట ప్రసాద్ బయట పెట్టారు. తాను పనిచేసిన ఒక మ్యాగజైన్ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఆ టైం లో తమని నష్టాల నుంచి గట్టెక్కించే డీల్ ఒక లిక్కర్ బ్రాండ్ ద్వారా కుదిరింది. తమ బ్రాండ్ కి ప్రచారం కల్పిస్తే భారీ మొత్తం ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారు. ఆఫర్ అయితే వచ్చింది. దానితో పాటు ఎక్కువ కాపీలు అమ్ముడయ్యేలా చేయాలి.
అలా చేయాలి అంటే చిరంజీవి ఫోటో కవర్ పేజీపై కనిపించాలి. కింద లిక్కర్ యాడ్ వేశాం. పైన చిరంజీవి ఫోటో ముద్రించాం. ఫైనల్ ఎడిషన్ కంప్లీట్ కాకముందే ఈ విషయం చిరంజీవికి తెలిసింది. చిరంజీవి మమల్ని పిలిపించారు. ఏంటిది అని ప్రశ్నించారు. ఆ యాడ్ వేరు.. మీ ఫోటో వేరు అని చెప్పాం. అది నాకు అర్థం అవుతుంది. కానీ సామాన్యులు ఎలా అర్థం చేసుకుంటారు ? లిక్కర్ బ్రాండ్ పైనే నా ఫోటో ఉంటే.. ప్రమోట్ చేస్తున్నది నేనే అని అనుకుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఒప్పుకోను.
ఆ బ్రాండ్ తో మాకు మంచి డీల్ వచ్చింది సార్ అని చెప్పాం. అయితే నా ఫోటో తీసేయండి అని అన్నారు. లిక్కర్ బ్రాండ్ పక్కన నా ఫోటో ఉండడానికి అసలు ఒప్పుకోను అని తేల్చేశారు. మా ఎండీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. వేస్తె లిక్కర్ బ్రాండ్ ఒక్కటే వేసుకోండి.. లేకుంటే నా ఫోటో ఒక్కటే వేయండి అని చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన ఫోటో తొలగించారు అని తోట ప్రసాద్ తెలిపారు.
మరొక పత్రికలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పట్లో ఒక బాబా ఉండేవారు. ఆ పత్రిక వారు బాబా ఫోటోని క్యాలెండర్ పై ముద్రించారు. కింద చిరంజీవి ఫోటో వేశారు. అది చూడడానికి బాబా చిరంజీవిని ఆశీర్వదిస్తునట్లు ఉంది. ఆయన ఆశీర్వాదం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారనే సెన్స్ తో అలా చేశారు. అది కూడా చిరంజీవి దృష్టికి వెళ్ళింది. దీనితో చిరంజీవి వాళ్ళని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశారు. ఏంటి ఈయన వల్ల నేను నెంబర్ 1 అయ్యానా అని దిమ్మతిరిగేలా వాళ్ళకి కౌంటర్ ఇచ్చినట్లు తోట ప్రసాద్ తెలిపారు.