మోహన్ బాబు చేయాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా.. చిరంజీవి దగ్గరకు.. ఎలా వచ్చింది..?

Published : Jun 08, 2024, 05:43 PM IST

ఇండస్ట్రీలో మోహన్ బాబు.. చిరంజీవి కథలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమో.. వైరమో అర్ధం కాదు. కాని ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరికి సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇంతకీ ఏంటా న్యూస్ తెలుసా..? 

PREV
16
మోహన్ బాబు చేయాల్సిన బ్లాక్ బస్టర్  సినిమా.. చిరంజీవి దగ్గరకు.. ఎలా వచ్చింది..?

మెగాస్టార్ చిరంజీవి - మంచు మోహన్ బాబు మద్య ఎంత మంచి స్నేహం ఉందో.. అంతే పోటీ తత్వం కూడా ఉంది. ఇద్దరికి ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బయట హగ్ చేసుకుని ఎంత మంచిగ ఉన్నా.. కొన్ని విషయాల్లో వీరి మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉంటాయి. లాస్ట్ టైమ్ మా ఎలక్షన్స్ లో  ఇవి బహిరంగంగానే బయటపడ్డాయి. 

26

ఇక గతంలో వీరి సినిమాల మద్య కూడా పోటీ గట్టిగా ఉండేదట. హీరోలలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగినా.. అటు లెజెండరీ యాక్టర్ గా మోహన్ బాబు కూడా చిరంజీవి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చిన రోజులు ఉన్నాయట. అంతే కాదు మోహాన్ బాబు  చేయాల్సిన సినిమాలను చిరంజీవి చేసి స్టార్ గా మారాడన్న వాదన కూడా ఒకటుంది. చిరంజీవి చేసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ.. మోహన్ బాబు చేయాల్సిందని టాక్. 

36

ఆ సినిమా ఏదో కాదు..మెగా మ్యానియా క్రియేట్ చేసిన హిట్లర్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి హిట్ల‌ర్ సినిమా 1997లో విడుద‌లై అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది. చిరంజీవి కెరీర్ నే  కీల‌క మ‌లుపు తిప్పింది. చిరంజీవి న‌టించిన క్లాసిక్ సినిమా హిట్ల‌ర్. అయితే ఈమూవీ ముందుగా  మోహ‌న్‌బాబు దగ్గరకు వెళ్లిందట. మలయాళ రీమేక్ కథ కావడంతో.. ఈసినిమా తెలుగు నెటివిటీకి తగ్గట్టు మార్చారు దర్శకులు ముత్యాల సుబ్బయ్య. 

46

ఈసినిమాను మలయాళంలో మ‌మ్ముట్టి చేశారు. అక్కడ కూడా మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. అయితే నిర్మాత, ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడు మోహ‌న్‌రాజా హిట్ల‌ర్‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిశారు.  మ‌ల‌యాళ వెర్ష‌న్ విడుద‌ల‌కు ఒక‌వారం ముందు తెలుగు రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే ఈసినిమా మ‌ల‌యాళ వర్షన్ చూసిన తరువాత పక్కాగా తెలుగులోచేయాలి అనుకున్నారట. అయితే హీరోగా మోహన్ బాబును తీసుకోవాలి అనిఫిక్స్అయ్యారట. 

 

 

56

కథ విన్న మోహన్ బాబు.. ఈమూవీ రీమేక్ ను రిజెక్ట్ చేయడంతో.. ఆ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల్లోకి వెళ్లింది. మెగాస్టార్ కు ఈసినిమా బాగా కలిసి వచ్చింది.  బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన వెంట‌నే చిరంజీవి యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా త‌న న‌ట‌న‌కు చాలా ప్ర‌శంస‌లు అందుకున్నారు.  

66

ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు న‌టించ‌డం ఒక ఎత్తు అయితే.. ఐదుగురుచెల్లెల్లు.. హీరోయిన్ గా రంభ గ్లామర్.. మరో ఎత్తు. ఇక ఈమూవీలో నటించిన వారంతాస్టార్లు కావడం.. సినిమాకుప్లాస్ అయ్యింది. అన్ని పాత్రలు బాగా సూట్ అయ్యాయి. ముఖ్యంగా  రాజేంద్ర‌ప్ర‌సాద్, సుధాక‌ర్ కామెడీ కూడా సినిమాకు హైలేట్ గా నిలుస్తాయి. హిట్ల‌ర్  సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లకు పైనే అయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories