మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో దాదాపుగా అన్ని జోనర్ చిత్రాలు చేశారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే చిరంజీవికి ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం మాస్ చిత్రాలే. నటనకు ప్రాధాన్యత ఉన్న స్వయం కృషి, ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి చిత్రాల్లో చిరు నటించారు. ఆ చిత్రాలలో చిరంజీవి నటనకి ప్రశంసలు దక్కాయి.