అక్కడ వాంతులు చేసుకున్నా, బాబాయ్ తన చేతులతో క్లీన్ చేశారు.. బాలయ్యకి ఎమోషనల్ మ్యాటర్ చెప్పిన రాంచరణ్

Published : Feb 02, 2023, 09:07 PM IST

పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటిటిలో ప్రసారం మొదలైంది. 

PREV
16
అక్కడ వాంతులు చేసుకున్నా, బాబాయ్ తన చేతులతో క్లీన్ చేశారు.. బాలయ్యకి ఎమోషనల్ మ్యాటర్ చెప్పిన రాంచరణ్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా సర్వర్లు క్రాష్ అయ్యాయి. అంతలా బాలయ్య షోకి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాజరైన ఎపిసోడ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. 

26

పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటిటిలో ప్రసారం మొదలైంది. 

36

పవన్ కళ్యాణ్ గురించి బాలయ్య సంచలన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా.. ప్రభాస్ ఎపిసోడ్ తరహాలోనే ఈ ఎపిసోడ్ లో కూడా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని ఫోన్ లైన్ లో తీసుకున్నారు. మీ నాన్న దగ్గర లేనప్పుడు మీ బాబాయ్ తో జరిగిన పెద్ద సీక్రెట్ ఏంటి అని బాలయ్య ప్రశ్నించారు.

46

దీనికి సమాధానం ఇస్తూ రాంచరణ్ ఒక సెన్సేషనల్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్ పంచుకున్నారు. తనకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తో సింగపూర్ కి వెళ్ళాను. దగ్గర నాన్న, అమ్మ ఎవరూ లేరు. దీనితో కళ్యాణ్ బాబాయ్ తో కలసి పిజ్జాలు, బెర్గర్ లు ఇష్టం వచ్చినట్లు తినేసా. అవి తేడా కొట్టి ఒక చోట విపరీతంగా వాంతులు చేసుకున్నా. అప్పుడు కళ్యాణ్ బాబాయ్.. నేను వాంతులు చేసుకున్న దానిని, నన్ను తన చేతులతో క్లీన్ చేశాడు అని రాంచరణ్ రివీల్ చేశాడు. 

56

చిన్నప్పుడు రాంచరణ్ ని , సాయిధరమ్ తేజ్ ని పెంచింది పవన్ కల్యాణే అట. ఒక ఏజ్ వచ్చేవరకు చరణ్ ని పవనే దగ్గరుండి చూసుకున్నాడు. చరణ్ ఎప్పుడైనా చెప్పిన మాట వినకపోతే చిరంజీవి అతడిని పవన్ కళ్యాణ్ దగ్గరకి పంపేవారట. దీనితో పవన్ క్లాస్ పీకడం, హితబోధ చేయడం చేసేవారట. 

66

పవన్ కళ్యాణ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అని బాలయ్య రాంచరణ్ ని ప్రశ్నించగా.. ఏమీ ఉండదు అండీ.. ఆయన లైఫ్ చాలా బోరింగ్ అని రాంచరణ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ షోలో మధ్యలో జాయిన్ అవుతాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories