రాంచరణ్ కూతురు క్లీంకారకి కేర్ టేకర్ ఎవరో తెలుసా..పాపని చూసుకోవడానికి అంత జీతమా

Published : Feb 04, 2024, 01:13 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ప్రస్తుతం తల్లి దండ్రులుగా తమ కుమార్తె క్లీంకారతో సంతోషంగా గడుపుతున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నపటికీ ముద్దుల కూతురి కోసం సమయం కేటాయిస్తున్నారు. 

PREV
16
రాంచరణ్ కూతురు క్లీంకారకి కేర్ టేకర్ ఎవరో తెలుసా..పాపని చూసుకోవడానికి అంత జీతమా

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ప్రస్తుతం తల్లి దండ్రులుగా తమ కుమార్తె క్లీంకారతో సంతోషంగా గడుపుతున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నపటికీ ముద్దుల కూతురి కోసం సమయం కేటాయిస్తున్నారు. బిడ్డ పుట్టకముందే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన చరణ్ ఉపాసన పాపకి అవసరమైనవి మొత్తం ముందే సమకూర్చారు. 

 

26

క్లీంకార కోసం భారీ ఖర్చుతో ప్రత్యేక గదిని తీర్చిదిద్దారు. ఆ రేంజ్ లో చరణ్ ఉపాసన ముద్దుల కూతురిపై ప్రేమ కురిపిస్తున్నారు. అయితే చరణ్ షూటింగ్స్ తో బిజీగా ఉంటాడు. ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో బిజీగా ఉంటారు. దీనితో పాపని చూసుకునేందుకు కేర్ టేకర్ తప్పనిసరి. 

 

36

చరణ్, ఉపాసన పాపని చూసుకునేందుకు సావిత్రి అనే కేర్ టేకర్ ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. సావిత్రి ఎవరో కాదు.. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూర్ కి కేర్ టేకర్ గా వ్యవహరించింది సావిత్రినే. తైమూర్ కి కేర్ టేకర్ గా ఉండడంతో సావిత్రి కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. 

 

46

పిల్లలని అర్థం చేసుకుని వారిని చక్కగా చోసుకోవడంలో సావిత్రి ఎక్స్ పర్ట్ అంటూ గతంలో కరీనా కపూర్ ప్రశంసల వర్షం కురిపించింది. కరీనా కపూర్ అంతటి నటి సావిత్రి గురించి చెప్పడంతో ఆమె క్రేజ్ ఇంకా పెరిగింది. బహుశా అందుకేనేమో తమ కూతురి కోసం చరణ్, ఉపాసన ఏరికోరి ఆమెని ఎంచుకున్నారు. 

 

56

ఆమె జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది. నెలకు సావిత్రికి లక్షన్నర ఇస్తున్నారట. ఇటీవల చరణ్, ఉపాసన ముంబై వెళ్ళినప్పుడు కూడా సావిత్రి కూడా వారితో కనిపించారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అఫీషయల్ గా మాత్రం సావిత్రిని క్లీంకార కోసం నియమించుకున్నట్లు ప్రకటించలేదు. 

 

66

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వేసిన సంబరాల్లో ఉన్నారు. 

 

click me!

Recommended Stories