డైరెక్టర్ అట్లీ నన్నుమోసం చేశాడు.. హీరోయిన్ సాక్షి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..

Published : Feb 04, 2024, 11:23 AM IST

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ  తనను మోసం చేశాడు అంటోంది హీరోయిన్ సాక్షీ అగర్వాల్. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే..?   

PREV
16
డైరెక్టర్ అట్లీ నన్నుమోసం చేశాడు.. హీరోయిన్ సాక్షి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..
Actress Sakshi Agarwal

తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్. తమిళంలో పాటు..సౌత్ భాషల్లో కొిన్నిసినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్నా.. అవకాశాలు సరిగ్గ రాక వెనకబింది బ్యూటీ. 

26
Sakshi Agarwal

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన సాక్షి అగర్వాల్ రాజా రాణి తర్వాత కన్నడ, మలయాళంతో సహా భాషల్లో నటించడం ప్రారంభించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాలా, అజిత్‌ సినిమాతో పాటు.. మరికొన్ని  చిన్న చిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. ఆమె తమిళ చిత్రసీమకే పరిమితం అయ్యింది.  

36
Actress Sakshi Agarwal

గత 10 ఏళ్లుగా తమిళ సినిమాల్లో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. రాజా రాణీ తరువాత సాలిడ్ హిట్ ను కొట్టింది లేదు. అంతే కాదు అసలు ఆమెకు అలాంటి పాత్ర కూడా పడలేదు.  తమిళంలో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కావల్సి ఉంది. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కామెంట్స్ చేసింది బ్యూటీ. అంతే కాదు.. డైరెక్టర్ అట్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సాక్షి. 
 

46
sakshi agarwal

రీసెంట్ గా జరిగిన  ఓ ఇంటర్వ్యూలో నటి సాక్షి అగర్వాల్ తన మొదటి సినిమా అనుభవం గురించి చెప్పింది. 2013లో మోడలింగ్‌ రంగంలో దూసుకుపోతున్న నాకు రాజా రాణి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే మొదట్లో నన్ను సెలెక్ట్ చేసిన కాస్టింగ్ ఏజెన్సీ ఈ సినిమాలో నేనే సెకండ్ ఫీమేల్ లీడ్ అని, ఆర్య ప్రధాన పాత్ర అని చెప్పింది. 

56
Atlee

నేనూ అది విని ఆ సినిమాలో నటించడానికి వెళ్లాను. షాపింగ్ మాల్ సీన్స కొన్ని చేశాను. కొంత షూటింగ్ లో పాల్గోన్నాను. ఆతరువాత  రెండు రోజులు గడిచినా షూటింగ్‌కి పిలుపు రాలేదు. ఒక దశలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా విడుదలైంది. సినిమా చూడటానికి వెళ్లి అవక్కయ్యాను. అసలు నా సీన్లు అన్నీ కట్ చేశారు. ఎడిటింగ్ లోలేపేశారు.  వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటే అని నాకు తర్వాతే తెలిసింది. 

66

అప్పుడు నాకు ప్రొడక్షన్ కంపెనీల గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే నేను అసలు అట్లీ దగ్గరికి వెళ్లి నా పాత్ర గురించి చర్చించలేదు. అది నా తప్పు అని చెప్పాడు. అలా తనను ఈసినిమా లో తీసుకుంటామని మోసం చేశారంటోంది సాక్షీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories