వణికే చలి, మంచులో మెగా హీరోలను చిరు ఎంత కష్ట పెట్టాడో.. సంక్రాంతి పండగ ఫోటోలు వైరల్‌.. అందరి చూపు అతనిపైనే

Published : Jan 17, 2024, 08:04 AM ISTUpdated : Jan 17, 2024, 08:10 AM IST

ఓ వైపు వణికే చలి, మరోవైపు ఎర్లీ మార్నింగ్‌ మంచు పొగ గార్డెన్‌లో మెగా హీరోలకు చుక్కలు చూపించాడు చిరంజీవి. అయితే ఇందులో అందరికి చూపు మాత్రం అతనిపైనే ఉండటం విశేషం.  

PREV
16
వణికే చలి, మంచులో మెగా హీరోలను చిరు ఎంత కష్ట పెట్టాడో.. సంక్రాంతి పండగ ఫోటోలు వైరల్‌.. అందరి చూపు అతనిపైనే

మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండని బెంగుళూరులో సెలబ్రేట్‌ చేసుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీతోపాటు, అల్లు అరవింద్‌ ఫ్యామిలీ కూడా అందులో పాల్గొని పండగని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. గత మూడు రోజులుగా వీళ్లు అక్కడే పండగ  చేసుకుని నిన్న రిటర్న్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా మెగా బ్రదర్‌ కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు.

26

ఇందులో ఉదయాన్నే పండగ పూట చిరంజీవి వారిని ఎంతగా కష్టపెట్టాడో ఇందులో చూపించారు. నాగబాబు, చిరంజీవి సెల్ఫీలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. పొద్దు పొద్దున్నే వాళ్లు పండగ చేసుకున్నారు. కానీ తమ పిల్లలను మాత్రం గట్టిగానే ఇబ్బంది పెట్టారు. 

36

ఇందులో పెద్దవాళ్లు చిరంజీవి, నాగబాబు, వారి చెల్లెళ్లు, బావలు ఎంజాయ్‌ చేస్తుంటే, వెనకాల మాత్రం రామ్‌చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, శిరీష్‌, ఉపసాన చలికి వణుకుతూ కనిపించారు. వీరంతా బెంగుళూరు గెస్ట్ హౌజ్‌లోని గార్డెన్‌ ఏరియాలో ఇలా పొద్దుపొద్దున్నే కనిపించడం విశేషం. 
 

46

ఈ ఫోటోలను నాగబాబు ఫోటోల్లో బంధించి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీని ఇలా చూసి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. 
 

56

అయితే ఇందులో అందరికి చూపు మాత్రం ఒక్కరిపై పడింది. అది పవన్‌ కళ్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌. ఆయనే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఇందులో అకీరా తన మ్యూజిక్‌ పర్‌ఫెర్మ్ కూడా చేశారు. అది మరింత ఎట్రాక్ట్ చేసింది. 

66

ఎప్పుడు చిరంజీవి ఇంట్లో సంక్రాంతి  సెలబ్రేషన్‌ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం బెంగుళూరులో పండగ చేసుకున్నారు. అందులో చిరంజీవి దంపతులు, నాగబాబు, రామ్‌చరణ్‌, అల్లు అరవింద్‌, బన్నీ, ఉపాసన, అల్లు స్నేహారెడ్డి, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, శిరీష్‌, అకీరా, ఆద్య, నిహారిక, లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుస్మిత వంటి వారు పాల్గొని సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories