దటీజ్ జూ.ఎన్టీఆర్.. తారక్ ని చూపిస్తూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. షాకింగ్ రీజన్

Published : Jun 09, 2024, 07:11 AM IST

ఎన్నికల హంగామా దేశవ్యాప్తంగా ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయి. అయినప్పటికీ ఏపీలో రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలు చిత్ర పరిశ్రమతో బలంగా ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అన్ని పార్టీల్లో సినీ ప్రముఖులు ఉన్నారు.

PREV
17
దటీజ్ జూ.ఎన్టీఆర్.. తారక్ ని చూపిస్తూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. షాకింగ్ రీజన్

ఎన్నికల హంగామా దేశవ్యాప్తంగా ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయి. అయినప్పటికీ ఏపీలో రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలు చిత్ర పరిశ్రమతో బలంగా ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అన్ని పార్టీల్లో సినీ ప్రముఖులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నందమూరి ఫ్యామిలీ ఉంది. ఇక జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 

27
Allu Arjun

జనసేన పార్టీ అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించింది. మెగా ఫ్యామిలీ నైతికంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపారు. కొందరు మెగా హీరోలు బహిరంగంగానే పవన్ కోసం ప్రచారం చేశారు. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయం సాధించిన తర్వాత శుభాకాంక్షలు కూడా తెలిపారు. 

37

అంతా బాగానే ఉంది కానీ ఎన్నికలకి ముందు అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డికి బహిరంగంగా మద్దతు తెలిపాడు. ఫ్యామిలీతో పాటు వెళ్లిన బన్నీ.. తన స్నేహితుడు విజయం సాధించాలని కోరారు. ఇది మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఒక వైపు తన కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోరాడుతుంటే.. వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ ఆ రోజు నుంచే అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మొదలైంది.

47

బన్నీ అభిమానులు తమ హీరోని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. బన్నీ తన స్నేహితుడికి మద్దతు తెలిపితే తప్పేంటి ? అల్లు అర్జున్ ఎక్కడా వైసిపిని సపోర్ట్ చేయలేదు. కేవలం శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు కాబట్టి విజయం సాధించాలని కోరుకున్నారు అంటూ బన్నీ అభిమానులు తమ వర్షన్ వినిపించారు. 

57

కానీ ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి ఓటమిపాలయ్యారు. దీనితో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మరింతగా ఎక్కువైంది. ఇప్పుడు మెగా అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూపిస్తూ అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ కి కూడా వైసీపీ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశి లాంటివారు తారక్ కి బెస్ట్ ఫ్రెండ్స్. 

67

కానీ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి చెందిన తెలుగు దేశం పార్టీకే కట్టుబడి ఉన్నారు. అందుకే తన స్నేహితులు వైసిపిలో ఉన్నా మద్దతు తెలపలేదు.. ప్రచారంలో పాల్గొనలేదు అని మెగా అభిమానులు అంటున్నారు. కుటుంబం పట్ల గౌరవం అంటే తారక్ లా ఉండాలని మెగా అభిమానులు అంటున్నారు. 

77

శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. తన మనసుకి నచ్చిన స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని బన్నీ తెలిపారు. శిల్పా రవిచంద్ర రెడ్డి భార్యకి అల్లు అర్జున్ భార్య స్నేహితురాలు. ఆ విధంగా శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ కి ఫ్రెండ్ అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories