కంగనా, సల్మాన్‌తో సహా చెంపదెబ్బలు తిన్న 5 మంది బాలీవుడ్ స్టార్స్ వీళ్ళే...?

Published : Jun 08, 2024, 07:40 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్... అందులోనూ.. బాలీవుడ్ అంటేనే వివాదం.. వివాదం అంటేనే బాలీవుడ్ అన్నట్టు ఉంటుంది. తాజాగా హీరోయిన్ కంగనా రనౌత్ చెంపదెబ్బ తిని రచ్చ రచ్చ చేసింది. ఇలా చెప్పదెబ్బలు తిన్న బాలీవుడ్ స్టార్స్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా..? 

PREV
16
కంగనా, సల్మాన్‌తో సహా  చెంపదెబ్బలు తిన్న  5 మంది  బాలీవుడ్ స్టార్స్ వీళ్ళే...?

బాలీవుడ్ అంటేనే వివాదాలతో నిండిన ప్రపంచం. రకరకాల కారణాలతో ఇండస్ట్రీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని సంఘటనలు వివాదాలకు దారితీయ్యడంతో పాటు.. స్టార్స్ ను కూడా షాక్ అయ్యేలా చేస్తుంటాయి.  సెలబ్రిటీలను పబ్లిక్‌గా చెప్పుతో కొట్టడం అలాంటి సంఘటనే. ఇటీవల కంగనా రనౌత్ బహిరంగంగా చెప్పుతో కొట్టడం ద్వారా హెడ్‌లైన్స్‌లో నిలిచింది, అయితే అలాంటి పరిస్థితులను చాలామంది స్టార్స్ ఎదుర్కొన్నారు. ఇంతకీ వారు ఎవరంటే..? 
 

26

ఈ లిస్ట్ లో కంగనా కంటే ముందే చేరిపోయాడు సల్మాన్ ఖాన్. ఢిల్లీ వ్యాపారవేత్త కుమార్తె సల్మాన్ ఖాన్ ప్రైవేట్ పార్టీకి వెళ్లి నటుడిని చెప్పుతో కొట్టినట్లు  వార్తలు వైరల్ అయ్యాయి.  మద్యం మత్తులో, ఆమె నటి సుస్మితా సేన్ మరియు సల్మాన్ తమ్ముడు సోహైల్‌ను దుర్భాషలాడింది. సల్మాన్ మౌనంగా ఉండి ఆమెను తీసుకెళ్లమని తన సెక్యూరిటీకి చెప్పారట.  

36

SIIMA అవార్డ్స్ 2022 రెడ్ కార్పెట్‌పై చెపందెబ్బతిన్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్.  సూపర్‌స్టార్‌ను చూడటానికి గుమిగూడిన ప్రేక్షకులను నియంత్రించడానికి ఆయన బాడీగార్డ్ లు ప్రయత్నిస్తున్న టైమ్ లో ..  రణవీర్ సింగ్ బాడీగార్డ్‌లలో ఒకరు అనుకోకుండా నటుడిని చెంపదెబ్బ కొట్టారు. ఈ పరిణామంతో ఆయన షాక్అయ్యారు. తరువాత విషయం తెలసుకుని కూల్ అయ్యారు. 
 

46

రా స్టార్ ఇండియా ప్రోగ్రాం ఫైనల్ ఈవెంట్ జరుగుతుండగా.. గౌహర్ ఖాన్ ను చెప్పదెబ్బ కొట్టాడు ఒక వ్యక్తి. లైవ్ ఈవెంట్ జరుగుతుండగా.. ప్రేక్షకుల్లో కూర్చున్న వ్యక్తి గౌహర్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. పొట్టి దుస్తులు ధరించడం ద్వారా తన మత విశ్వాసాలను (ఇస్లామిక్ విశ్వాసాలు) కించపరిచేలా చేస్తున్నారని ఆయన అన్నారు. తాను కొట్టడాన్ని ఆయనసమర్ధించుకున్నారు. 

56

2011లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ పబ్‌లో గాయకుడు ఆదిత్యను ఓ అమ్మాయి చెంపదెబ్బ కొట్టింది. అక్కడ ఉన్నవారిసమాచారం  ప్రకారం, అతను మద్యం మత్తులో ఉన్నాడు. ఓ అమ్మాయిపై ఈ గాయకుడు ఒక వ్యాఖ్య చేసాడు.. అంతే కాదు ఆమెకు తగలడంతో పాటు.. మీద మీదకు రావడంతో ..  అసౌకర్యంగా భావించి, ఆమె చివరకు అతనిని చెంపదెబ్బ కొట్టింది.

66

బాలీవుడ్ హాట్ బ్యూటీ  మల్లికా షెరావత్‌ గురించి తెలిసిందే.. ఆమెకు కూడా ఈ అనుభవం అయ్యింది.  పారిస్ అపార్ట్‌మెంట్ బ్లాక్  లో ఆమె తన  ప్రియుడు మరియు ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్‌ఫోన్స్‌తో కలిసి ఉంది.  కాగా ముసుగు వేసుకున్న  ముగ్గురు  వ్యక్తులు వారిపై పడి దోచుకోవడంతో పాటు... మల్లిక ను చెప్పదెబ్బ కోట్టారట. 

click me!

Recommended Stories