Brahmamudi: మొదటిసారి భార్యను మెచ్చుకున్న కృష్ణమూర్తి.. స్వప్నని వెతకడానికి బయలుదేరిన కావ్య దంపతులు!

Published : Jun 12, 2023, 01:07 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ బొక్క బోర్లా పడ్డ ఒక జంట కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: మొదటిసారి భార్యను మెచ్చుకున్న కృష్ణమూర్తి.. స్వప్నని వెతకడానికి బయలుదేరిన కావ్య దంపతులు!

ఎపిసోడ్ ప్రారంభంలో ఆఫ్ట్రాల్ బేరరి వి నీతో మాటలేంటి బయటికి పో అంటూ కామరాజుని కసురుకుంటుంది స్వప్న. ఎంత మాట అన్నావు రసగుల్లా అనుకుంటూ ఇబ్బంది పడిపోతాడు కామరాజు. చెప్తుంది కదా వెళ్ళు అంటూ తరిమేస్తుంది మీనాక్షి. మరోవైపు ఆడవాళ్ళందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటే మగవాళ్ళందరూ చూస్తూ ఉంటారు.
 

29

అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ ఇదేనా మెహందీ ఫంక్షన్ అంటే.. చాలా డల్ గా ఉంది అంటాడు. అలా కాదు గాని కుడి చేతికి ఆడవాళ్లు మెహందీ పెట్టుకుంటారు ఎడం చేతికి వాళ్ళ భర్తలు వాళ్ళ పేర్లు రాయండి అంటాడు కళ్యాణ్. ఇదేదో బావుంది అంటాడు సుభాష్. అందరి పేర్లు చిన్నవి కానీ మా ఆయన పేరు చాలా పెద్దది ఏం చేయాలి అని చిన్నపిల్లలాగా అంటుంది చిట్టి.

39

నిజమే నానమ్మ.. ఇంటిపేరు వంటిపేరు కలిపితే భుజం వరకు వెళ్ళిపోతుంది అంటాడు రాజ్. మీరు అలా చూస్తూ ఉండండి నేను రాస్తాను అని చెప్పి అందరినీ కళ్ళు మూసుకోమంటాడు సీతారామయ్య. అందరూ కళ్ళు మూసుకున్నాక భార్య చేతి మీద బి లెటర్ రాస్తాడు. అది చూసిన అందరూ ఏంటది అని అడుగుతారు. బి అంటే బావ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే పిలుపు అదే అభిమానం అంటూ సిగ్గుపడిపోతుంది చిట్టి.

49

 భర్తలందరూ వారి భార్యల చేతి మీద పేర్లు రాయటం మొదలు పెడతారు. స్వప్న కూడా రాహుల్ ని తన చేతి మీద రాయమంటుంది. నాకు రాదు అని చెప్తాడు రాహుల్. నేను రాయాలి అంటే ఆ కామరాజు గాడి పేరు రాయాలి వాడే దీనికి కాబోయే భర్త అని మనసులో అనుకుంటాడు.  వాళ్లందర్నీ చూసినా రాజ్ నేను కూడా మెహందీ పెట్టాలేమో అనుకొని అక్కడ నుంచి చల్లగా జారుకోబోతాడు.

59

కానీ కావ్య, కళ్యాణ్ కలిసి రాజ్ ఆటలు సాగనివ్వరు. చచ్చినట్టు కావ్య చేతి మీద ఆర్ అని రాస్తాడు రాజ్. భార్యగా ఒప్పుకోనన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటుంది కావ్య. చచ్చినా ఒప్పుకోను అది బలవంతపు పెళ్లి ఇది కూడా బలవంతంగానే పెడుతున్నాను అంటాడు రాజ్. వాళ్లని అలా చూస్తూ ఎమోషనల్ ఫీలవుతారు కనకం దంపతులు. మొదటిసారి నువ్వు వాడిని అబద్ధం అందంగా కనిపిస్తుంది అంటూ భార్యని మెచ్చుకుంటాడు కృష్ణమూర్తి.

69

 అదే సమయంలో ఒంటరిగా కూర్చున్న సుభాష్ దగ్గరికి వస్తాడు ప్రకాశం. ఈ సంతోషంలో మందెయ్యాలని ఉంది కానీ పెద్దరికం అడ్డు వస్తుంది అంటాడు సుభాష్. అందుకే అన్నయ్య ఈ జ్యూస్ లో వోడ్కా కలిపి తీసుకువచ్చాను తాగు అంటాడు ప్రకాశం. కొంచెం కొంచెంగా తాగుతున్న అన్నతో ఏం పర్వాలేదు అన్నయ్య ఇలాంటివి చాలా ఉన్నాయి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యు అంటూ వోడ్కా కలిపిన మ్యాంగో జ్యూస్ గ్లాస్ లని చూపిస్తాడు ప్రకాశం.

79

ఎవరికి అనుమానం మాత్రం రాకూడదు అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.మరోవైపు డెస్టినేషన్ పెళ్లి అన్నావు ఆఖరికి ఇలా సింపుల్ గా  చేస్తున్నావు అంటూ నిస్టూరం గా మాట్లాడుతుంది స్వప్న. నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను నన్ను గెలకొద్దు అంటూ స్వప్నని కసురుకుంటాడు రాహుల్. స్వప్న కూడా చికాగ్గా అక్కడ నుంచి లేచి అందరూ ఉన్న దగ్గరికి కూర్చుంటుంది.

89

నా రసగుల్లా ఎందుకు అలిగినట్లుగా ఉంది అనుకుంటూ కామరాజు వోడ్కా కలిపిన జ్యూస్లని తీసుకువస్తాడు. అందులో మందు కలిపిన సంగతి అతనికి కూడా తెలియదు. స్వప్న ఒక్కదానికే ఇస్తే అనుమానం వస్తుంది అనుకొని అందరికీ ఇస్తాడు. అందరూ తాగి టెస్ట్ డిఫరెంట్ గా ఉంది అనుకుంటారు. దానిలక్ష్మి టేస్ట్ బాగుంది అంటూ జ్యూస్ మీద జ్యూస్ తాగుతుంది.

99

 వీళ్లు వోడ్కా తాగుతున్నారన్న విషయం సుభాష్ వాళ్లకి అర్థమవుతుంది. తరువాయి భాగంలో స్వప్న పెళ్లిలో నుంచి వెళ్ళిపోయింది తప్పు తనదే కాబట్టి పెళ్లి రద్దు చేయండి అంటుంది రుద్రాణి. స్వప్నని వెతకటానికి బయలుదేరుతారు రాజ్ దంపతులు.

click me!

Recommended Stories