మెగా ఫ్యామిలీ స్టార్ కిడ్ క్లింకార.. రామ్ చరణ్ , ఉసానల ముద్దుల కూతురు.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు.. క్లింకార. చరణ్, ఉపాసనల పెళ్లి తరువాత 10 ఏళ్ళకు కలిగిన సంతానం కావడంతో.. ఈ పాప ఆ ఇంట చాలా స్పెషల్. అంతే కాదు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా క్లింకారను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు.
ఇక క్లింకరకు సబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వూరల్ అవుతూ వస్తోంది. క్లింకార పుట్టినప్పటి నుంచి మెగా హీరోలకు బాగా కలిసి వస్తోంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు, ఆస్కార్ తో పాటు ఎన్నో అవార్డ్ లు రావడం, జేమ్స్ కామరూన్ లాంటి వారు చరణ్ నటనను ప్రశంసించడం. ఆతరువా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్, రీసెంట్ గా మెగాస్టార్ కు పద్మ విభూషన్ రావడం.. క్లింకార అడుగు పెట్టిన వేళా విశేషం అంటూ.. మెగా ఫ్యామిలీ మురిసిపోతున్నారు.
ఇక క్లింకారాకు సంబంధించిన మరో న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంత ముద్దుగా చూసుకునే ఈ స్టార్ కిడ్ ను మెగా ఫ్యామిలీలో అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు. క్లింకారన నిక్ నేమ్ ఏంటి..? అని మెగా ఫ్యాన్స్ కు .. కామన్ ఆడియన్స్ కు పెద్ద డౌట్ వచ్చింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాటల్లో మాటగా క్లింకారను కారా.. అని సంబోధించడం వినిపించిందట. దాంతో ఆమెనిక్ నేమ్ ఏంటో రివిల్ అయ్యింది.
Chiranjeevi Ram Charan Klin Kaara
అయితే మెగా ఫ్యామిలీ అంతా క్లింకారను కారా అని ముద్దుగా పిలుచుకుంటారు అని అనుకుంటున్నారుమెగా ఫ్యాన్స్. అయితే ఉపాసన మాత్రమే అలా పిలుస్తుందా...? లేకా అందరూ అలానే పిలుస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇంటర్వ్యూలో క్లింకార కుసబంధించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు ఉపాసన.
క్లింకార నాన్న కూచీ అన్నారు ఉపాసన. ఆమె రామ్ చరణ్ కు బాగాఎమోషనల్ గా కలెక్ట్ అయ్యి ఉంది. చరణ్ ను చూడగానే స్పెషల్ గా నవ్వుతుంది. చరణ్ కనిపించగానే క్లింకార ఫేస్ లో మెరుపు కనిపిస్తుంది. ఎప్పుడు నవ్వే లా కాకుండా చాలా స్పెషల్ గా నవ్వుతుంది.. అందుకే క్లింకార నాన్న కూచి అంటుంది ఉపాసన.
ఇక ఈమెగావారసురాలి గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్లింకార పుట్టి చాలా నెలలు గడుస్తున్నా కాని.. ఆ పాప ఫోటోను కాని.. ఫేస్ ను కాని రివిల్ చేయలేదు మెగా ఫ్యామిలీ. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా.. ఫేస్ బ్లర్ చేసి పెడుతున్నారు. బయటకు వస్తే.. ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. అటు ఫ్యాన్స్ మాత్రం క్లింకారను చూడాలని.. ఎప్పుడు చూపిస్తారంటూ..అడుగుతున్నారు.