`స్పిరిట్‌` బ్యాక్‌ డ్రాప్‌, ప్రభాస్‌ రోల్‌ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. `మ్యాడ్‌` క్యారెక్టరైజేషన్‌

Published : Feb 09, 2024, 12:33 PM ISTUpdated : Feb 09, 2024, 12:35 PM IST

ప్రభాస్‌నెక్ట్స్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న `స్పిరిట్‌` మూవీకి రెడీ అవుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన డిటెయిల్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. 

PREV
16
`స్పిరిట్‌` బ్యాక్‌ డ్రాప్‌, ప్రభాస్‌ రోల్‌ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. `మ్యాడ్‌` క్యారెక్టరైజేషన్‌

ప్రభాస్‌ `సలార్‌`తో ఊపులో ఉన్నాడు. త్వరలో `కల్కి`తో సంచలనాలకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో `రాజాసాబ్‌`తో రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు మరో మూవీకి సంబంధించిన అప్‌డేట్లు ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా ఇది ప్రభాస్‌ సినిమా జాతర అనేలా మారిపోయింది.  

26

`యానిమల్‌` వంటి బోల్డ్ మూవీ చేసి సంచలనాలు క్రియేట్‌ చేశాడు సందీప్‌ రెడ్డి వంగా. నెక్ట్స్ ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారు. `స్పిరిట్‌` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు దర్శకుడు సందీప్‌. `యానిమల్‌` సంచలన విజయం సాధించడంతో ప్రభాస్‌ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌నే ఆ రేంజ్‌లో చూపిస్తే, ఇక ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అది ఊహించుకుంటేనేఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. 

36
Spirit

అయితే దానికి తగ్గట్టుగానే ఓ క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఈ మూవీ పోలీస్‌ స్టోరీగా చాలా రోజులుగా వినిపిస్తుంది. అయితే సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఇది కథగా కంటే ప్రభాస్‌ పాత్రనే మెయిన్‌గా ప్రొజెక్ట్ చేయబోతున్నారట. ఆయన క్యారెక్టరైజేషన్‌ ప్రధానంగానే సినిమా సాగుతుందట. సందీప్‌ చేసిన `అర్జున్‌ రెడ్డి`, `యానిమల్‌` చిత్రాలు కూడా అలానే రూపొందాయి. 

46

అయితే ఇందులో ప్రభాస్‌ని ఓ మ్యాడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించబోతున్నారట. చాలా సిన్సియర్‌గా, నిజాయితీగా ఉంటాడని, అదే సమయంలో చాలా యారగెంట్‌గా ఉంటాడని తెలుస్తుంది. పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందట. పోలీస్‌గా ప్రభాస్‌ చేసే రచ్చ వేరే లెవల్‌ అని అంటున్నారు. మొదటిసారి ప్రభాస్‌ పోలీస్‌ పాత్ర పోషిస్తుండటం ఓ విశేషమైతే, ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన పోలీస్‌ పాత్రకి మించి నెవర్‌ బిఫోర్‌ అనేలా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ సందీప్‌ని చూశాక, ఇది అబద్దమని నమ్మడం కష్టమే. 
 

56

ఇక `స్పిరిట్‌` షూటింగ్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది. అక్టోబర్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేయాలని సందీప్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మ్యాగ్జిమమ్‌ అక్టోబర్‌ లేదంటే నవంబర్‌లో ఎలాగైనా సెట్స్ మీదకు తీసుకుపోవాలనుకుంటున్నారట. ఆ దిశగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారట `యానిమల్‌` డైరెక్టర్‌. దీంతో ఇది ఇప్పుడే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. మరి సినిమా తెరపైకి వచ్చాక ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. 
 

66

`సలార్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది మే 9న విడుదల కాబోతుంది. ఇండియన్‌ బిగ్గెస్ట్ మూవీగా ఇది రిలీజ్‌ కాబోతుంది. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో చేసిన `రాజాసాబ్‌` రానుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నారట. ఆ తర్వాత `స్పిరిట్‌` వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు `సలార్‌2`లో కూడా పాల్గొనబోతున్నారు ప్రభాస్‌. ఇది వచ్చే ఏడాది గానీ, లేదంటే 2026లోగానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories