శివాజీని గట్టిగా హత్తుకుని ఏడ్చేసిన ఆ లేడీ కంటెస్టెంట్... వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసా?

First Published | Feb 9, 2024, 1:01 PM IST


బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ ఓ చోటకు చేరారు. మొదటిసారి దాదాపు 19 మంది కంటెస్టెంట్స్ హాజరయ్యారు. బీబీ ఉత్సవం షో కోసం వీరందరూ కలవడం జరిగింది. ఈ క్రమంలో సరదాలు, భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. 
 

Bigg Boss


శ్రీముఖి యాంకర్ గా బీబీ ఉత్సవం పేరుతో స్పెషల్ షో రూపొందించారు. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. బీబీ ఉత్సవం  ప్రోమో విడుదల కాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

BB Utsavam

బీబీ ఉత్సవం అన్నారు... తినడానికి ఏమైనా పెడతారా అని శ్రీముఖిని టేస్టీ తేజ అడిగాడు. ఈ సీజన్ కి నలుగురిని మింగావ్ అని శ్రీముఖి కౌంటర్ వేసింది. తేజ నామినేట్ చేసిన వాళ్ళందరూ ఎలిమినేటైన విషయాన్ని శ్రీముఖి అలా చెప్పింది. 
 


BB Utsavam

పల్లవి ప్రశాంత్-రతిక రోజ్ ఒకే ఒక్కడు చిత్రంలోని 'ఉట్టి మీద కూడు' సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ సాంగ్ ముగిశాక  రతిక రోజ్ క్షమాపణలు చెప్పింది. హౌస్లో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మనసులో పెట్టుకుని ఉంటే క్షమించు అని పల్లవి ప్రశాంత్ ని కోరింది. 

BB Utsavam

అమర్ దీప్ కి ఒక ఫన్నీ పరీక్ష పెట్టారు. ఒక చీర ఆరడానికి 30 నిమిషాల సమయం పడితే 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది? అని అడిగారు. అమర్ దీప్ చెప్పిన ఆన్సర్ కి శివాజీ.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. 
 

BB Utsavam


అనంతరం  భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. శివాజీని గట్టిగా వాటేసుకుని నయని పావని ఏడ్చేసింది. శివాజీ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. నాయిని పావని హౌస్లో ఉంది ఒక వారమే అయినా శివాజీతో గట్టి బంధం ఏర్పడింది. 
 

Bigg Boss

శివాజీని సొంత తండ్రి కంటే ఎక్కువగా నయని పావని భావిస్తుంది. ఎలిమినేట్ అయిన పావని శివాజీకి ఓటు వేయాలని క్యాంపైన్ చేసింది. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా కన్నీరు పెట్టుకోవడం బీబీ ఉత్సవం ప్రోమో లో చూపించారు. వీరు అంతగా ఫీల్ అవడం వెనుక రీజన్ ఏమిటో తెలియలేదు.

Latest Videos

click me!