`మెగా` సంక్రాంతి పండగ అక్కడే.. అకీరా, ఆద్య, భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి రామ్‌చరణ్‌ బెంగుళూరు షిఫ్ట్

Published : Jan 13, 2024, 12:32 PM IST

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్‌ ఈ సారి కొత్తగా ప్లాన్‌ చేశారు. అంతా హైదరాబాద్‌ నుంచి ఖాళీ అవుతున్నారు. ఈ సారి కొత్త ప్లేస్‌లో సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. తాజాగా అంతా కదిలారు.   

PREV
16
`మెగా` సంక్రాంతి పండగ అక్కడే.. అకీరా, ఆద్య, భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి రామ్‌చరణ్‌ బెంగుళూరు షిఫ్ట్

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్‌ చాలా వరకు అంతా కలిసే జరుపుకుంటున్నారు. అల్లు ఫ్యామిలీ కూడా కలిసిపోతుంటారు. మాగ్జిమమ్‌ చిరంజీవి ఇంటి వద్ద ఈ వేడుక జరుగుతుంటుంది. అంతా ఒక్క రోజు ముందే అక్కడికి చేరుకుని సంక్రాంతిని పండుగని కన్నుల పండుగగా జరుపుకుంటారు.

26

 మెగా హీరోలంతా కలిస్తే ఆ సందడి ఏం రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం కొత్తప్లేస్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అంతా కలిసి ఇప్పుడు బెంగుళూరుకి షిఫ్ట్ అవుతున్నారు. 
 

36

తాజాగా మెగా పవర్‌ స్టార్‌ ఎయిర్‌ పోర్ట్ లో మెరిశారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి ఆయన బెంగుళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ లో మెరిశారు. ఇందులో ఉపసాన తన పప్పిని ఎత్తుకుని కనిపించగా, రామ్‌చరణ్‌ తన కూతురుని ఎత్తుకుని వెళ్లారు. 

46

మరోవైపు ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కొడుకు, కూతురు మెరవడం విశేషం. పవన్‌ కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యలు సైతం బెంగుళూరు వెళ్తున్నారు. వీరు కూడా ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. 
 

56

ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ బెంగుళూరు వెళ్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. అయితే బెంగుళూరు సెలబ్రేట్‌ చేసుకోవడానికి కారణం ఏంటని చూస్తే, అక్కడ చిరంజీవి పెద్ద గెస్ట్ హౌజ్‌ ఉంది. ఫామ్‌ హౌజ్‌ తరహాలో ఉంటుంది. ఈ సారి అక్కడే మెగా హీరోలు సంక్రాంతిని పండగని జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. 
 

66

ఇకపై ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటాడా అనేది సందేహంగా మారింది. అదే సమయంలో అల్లు ఫ్యామిలీ కూడా వెళ్తుందా అనేది చూడాలి. అల్లు అర్జున్‌ పుష్ప 2` షూటింగ్‌లో ఉన్నారు. మరి వాళ్లు కూడా వెళ్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories