Guppedantha Manasu 13th January Episode:ధరణిని మాయ చేసి, వసుధార ఇంట్లో దూరిన శైలేంద్ర..!

Published : Jan 13, 2024, 10:40 AM IST

ఆ మాటలు విని ధరణి నిజమే అనుకొని భయపడుతుంది. ఎలాగైనా రిషిని కాపాడాలని అనుకుంటుంది.

PREV
18
Guppedantha Manasu  13th January Episode:ధరణిని మాయ చేసి, వసుధార ఇంట్లో దూరిన శైలేంద్ర..!
Guppedantha Manasu

Guppedantha Manasu  13th January Episode: వసుధార తన తండ్రి దగ్గర ఉండటంతో.. ఆమెను చంపడం భద్రకు కష్టంగా ఉంటుంది. తన ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కావడం లేదని.. మరో ప్లాన్ వేస్తాడు. దానిలో భాగంగానే మహేంద్ర దగ్గరకు వెళ్లి.. తాను ఉద్యోగం మానేస్తాను అని చెబుతాడు. ఎందుకు అని మహేంద్ర అంటే... తనకు ఏ పనీ లేదని.. పనిలేకుండా జీతం తీసుకోలేను అని చెబుతాడు. వసుధార మేడమ్ ఎక్కడో ఉంటున్నారని, కావాలంటే తనను కూడా అక్కడికే పంపించండి అని, లేదంటే వసుధార మేడమ్ ని ఇక్కడికి రమ్మనండి అని   డైరెక్ట్ గా చెప్పకుండా.. అదే అర్థం వచ్చేలా మాట్లాడతాడు. వసుధార ఇక్కడికి రాదని, అక్కడే ఉండి రిషిని చూసుకోవాలని మహేంద్ర మనసులో అనుకుంటాడు. అయితే.. తాను వసుధారతో మాట్లాడతాను అని.. వస్తే సంతోషమే కదా అని మహేంద్ర అంటాడు. తర్వాత పనిలేదు అంటున్నావ్ కదా.. కారులో వెళ్లి డీజిల్ కొట్టించుకొని రమ్మని చెబుతాడు.

28
Guppedantha Manasu


మరోవైపు  శైలేంద్ర.. వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే రిషి.. చక్రపాణి ఇంట్లో లేడా అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. రిషి కచ్చితంగా చక్రపాణి ఇంట్లోనే ఉండి ఉంటాడని, తన మనుషుల కంట పడకుండా వసు జాగ్రత్తపడుతుందేమో అని అనుకుంటాడు. తాను రంగంలోకి దిగి ఎలాగైనా.. రిషి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. ఎలా అనుకుంటూ ఉండగా.. ధరణి కనపడుతుంది. అప్పటికప్పుడు ప్లాన్ వేస్తాడు.

38
Guppedantha Manasu

ధరణికి వినపడేలా.. రిషి తాను పురమాయించిన రౌడీలకు దొరికిపోయినట్లు మాట్లాడతాడు. అది విని ధరణి నిజమని అనుకుంటుంది.  ధరణిని మరింత భయపెట్టడానికి.. తానే స్వయంగా రిషిని తన చేతులతో చంపేస్తానని, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి వెళతాడు. ఆ మాటలు విని ధరణి నిజమే అనుకొని భయపడుతుంది. ఎలాగైనా రిషిని కాపాడాలని అనుకుంటుంది.

48
Guppedantha Manasu

మరోవైపు భద్ర ప్రవర్తన వింతగా ఉందని, అనుమానంగా ఉన్నాయని  అనుపమ మహేంద్రతో అంటుంది. తమను కాపాడినప్పుడు కూడా సడెన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు అని అనుపమ అంటుంది. మహేంద్ర కూడా.. భద్ర అందరిలా కాదు అని, కానీ...వసుధార ఇంటికి ఎలా వెళ్లాడో అర్థం కావడం లేదు అని మహేంద్ర అంటాడు. ఇద్దరూ కలిసి భద్ర ఏదో ప్లాన్ ప్రకారం ఈ ఇంట్లో చేరాడేమో అని అనుకుంటారు. పనిలో నుంచి తీసేద్దామా అని మహేంద్ర అంటే.. బయటకు వెళ్లిపోతే.. అతని గురించి మనకు తెలీదని.. మన శత్రువు అతనిని పంపి ఉంటే.. వారి కదలికలు మనకు తెలీవని.. ఇక్కడే ఉంచుకుందాం అని అనుపమ అంటుంది. మహేంద్ర సరే అంటాడు.

వాళ్లు అలా అనగానే.. భద్ర వస్తాడు.  అప్పుడే.. కారు లో డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించావా అని అడిగితే.. అసలు వెళ్లలేదు అంటాడు. ఎందుకు అంటే.. డబ్బులు లేకుండా ఎలా కొట్టించాలి అంటాడు. దీంతో.. మహేంద్ర కార్డు ఇస్తాడు. అది తీసుకొని భద్ర వెళ్లిపోతాడు. మనం మాట్లాడుకున్నది విన్నాడంటావా అని అనుపమ.. విన్నా ఏమీ కాదులే అని మహేంద్ర అంటాడు.

58
Guppedantha Manasu

ఇక, శైలేంద్ర మాటలకు భయపడిన ధరని.. వెంటనే వసుధారకు ఫోన్ చేస్తుంది. రిషిని మా ఆయన మనుషులు పట్టుకున్నారంట.. రిషిని వాళ్లు ఎక్కడో పెట్టారట.. ఆయన హడావిడిగా వెళ్లారు.. నువ్వు ఎలాగైనా రిషిని కాపాడాలి అని ధరణి చెబుతుంది. వసుధారకు వెంటనే అనుమానం వస్తుంది. కానీ.. ఆ విషయం బయటపడకుండా.. అలా తాను జరగనివ్వను అని, నేను చూసుకుంటాను అని వసుధార అంటుంది. అదంతా.. ఫోన్ లాక్కొని శైలేంద్ర వింటాడు. ఇంకా వసు ఏదో చెప్పబోతుంటే.. ధరణి ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది.

68
Guppedantha Manasu

తర్వాత.. శైలేంద్ర.. తాను కావాలనే నువ్వు వినపడాలనే అలా మాట్లాడాను అని చెబుతాడు. అది విని.. ధరని.. శైలేంద్రను చీదరించుకుంటుంది. తనపై అత్తయ్యగారు కపట ప్రేమ చూపించినప్పుడే తనకు అర్థమైందని ధరణి అంటుంది. తెలుసుకొని ఏం చేయగలవు అని వీళ్లు సెటైర్ వేస్తారు.. రిషి వచ్చిన తర్వాత..మీ ఆట కట్టిస్తాడని ధరని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తనకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనే.. ఈ ఫోన్ నాటకం ఆడానని.. అది వర్కౌట్ అయ్యిందని శైలేంద్ర తల్లితో అంటాడు. తర్వాత.. చక్రపాణి ఇంటికి.. దొంగలా గోడ దూకి ఇంట్లోకి వెళతాడు. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. నెమ్మదిగా వెళ్తుంటే.. సడెన్ గా వసుధార లైట్ వేస్తుంది. వసుధారను చూసి శైలేంద్ర షాకౌతాడు. ఏదో చెప్పబోతుంటే.. వసుధార శైలేంద్రను చీదరించుకుంటుంది. ఇంత నీచంగా, హీనంగా ప్రవర్తిస్తావా అని అడుగుతుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా కుక్కతో పోల్చి మరీ తిడుతుంది. కానీ..తప్పక చేయాల్సి వచ్చింది అని శైలేంద్ర తన పనిని సమర్థించుకుంటాడు.

78
Guppedantha Manasu

అసలు ఎందుకు వచ్చావ్ అని వసుధార అడిగితే.. తన తమ్ముడిని చూడటానికి వచ్చాను అంటాడు. ఇక..వసు ఆ మాట అన్నందుకు మరింత దారుణంగా తిడుతుంది. తర్వాత.. రిషి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. తనకు తేలీదు అని వసు అంటుంది. అయితే.. శైలేంద్ర తనకు  తెలుసని.. రిషి నీ దగ్గరే ఉన్నాడని.. ఎక్కడ ఉన్నాడో చూపించమని అడుగుతాడు. కానీ.. ఎంత అడిగినా వసు మాత్రం.. తనకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలీదు అని చెబుతుంది. శైలేంద్ర మాత్రం.. ఈ రోజు రిషిని ఎలాగైనా పట్టుకుంటానని, ఈ రోజు పట్టుకొని వాడిని చంపిన తర్వాతే వెళతాను అని చెబుతాడు. వసుధార ఎంత తిట్టినా.. దులిపేసుకొని.. తాను రిషిని చంపాల్సిందే అంటాడు. వసు మాత్రం .. ఏ మాత్రం బయపడకుండా.. నాకు తెలీదు అంటుంది. దీంతో.. ఇంట్లో వెతకడానికి రెడీ అీవుతాడు. వసు అడ్డుపడుతుంది.

88
Guppedantha Manasu

మరోవైపు ధరణి.. మహేంద్రకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. శైలేంద్ర ఏదో ప్లాన్ చేశాడని... తనతో శైలేంద్ర ఆడిన డ్రామా అంతా వివరిస్తుంది. ఆయన రిషి గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారని, తనకు భయంగా ఉందని.. రిషి ఆచూకీ ఆయనకు తెలీకూడదని. మీరే ఏదో ఒకటి చేయాలని అంటుంది. దీంతో.. మహేంద్ర వసుకి ఫోన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు.

మరోవైపు... శైలేంద్ర.. తాను రిషిని చూడాల్సిందే అంటాడు. అసవరమైతే.. నిన్ను చంపేసి.. తర్వాత రిషిని చంపుతాను అంటాడు. వసు తాను ముకుల్ కి ఫోన్ చేస్తాను అని బెదరిస్తుంది. వాడు వచ్చేంత వరకు నేను  చూస్తూ ఊరుకుంటానా అని వసుని పక్కకు నెట్టి.. లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే.. వసు... రిషిని వేరే ప్లేస్ కి మార్చేసి ఉండొచ్చు.
 

click me!

Recommended Stories