ఒక్కటి కాబోతున్న మెగా ఫ్యామిలీ హీరో, యాంకర్‌ మేఘన.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటో వైరల్‌

Published : Aug 11, 2022, 04:37 PM IST

మెగా ఫ్యామిలీ హీరో పవన్‌ తేజ్‌, యాంకర్‌, నటి మేఘన గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.   

PREV
17
ఒక్కటి కాబోతున్న మెగా ఫ్యామిలీ హీరో, యాంకర్‌ మేఘన.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటో వైరల్‌

`ఈ కథలో పాత్రలన్నీ కల్పితమే` చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు మెగా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెల(Pavan Tej Konidela). మెగా ఫ్యామిలీకి చెందిన పవన్‌ తేజ్‌ గత కొంత కాలంగా యాంకర్‌ మేఘన(Anchor Meghana)తో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ ఇద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 

27

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన ఎంగేజ్‌మెంట్‌ (PavanTej Meghana Engagement) జరిగింది. బుధవారం వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్టు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ ఇద్దరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడుగుతున్న ఫోటోని పంచుకున్నారు. తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. 

37

ఎంగేజ్‌మెంట్ ఫోటోని పంచుకుంటూ `నేను ఆమెని ప్రేమిస్తున్నాను. ఇది అన్నింటికి ఆరంభం. ప్రేమంటే ఏంటో నాకు తెలిసిందంటే అది నీవల్లనే` అని పేర్కొన్నారు పవన్‌ తేజ కొణిదెల. ఈ సందర్బంగా లవ్‌ ఎమోజీలను పంచుకున్నారు. 

47

మరోవైపు మేఘన కూడా తన ప్రేమని వ్యక్తం చేసింది. `మీట్‌ మై ఫరెవర్‌. నేను నా ప్రేమని కనుగొన్నాను. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు నా హృదయం తేలికైనది. నా చేయి బరువైనది. నా మొత్తం హృదయం, నా మొత్తం జీవితం నీకే` అంటూ పేర్కొంది మేఘన. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

57

కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్ తేజకి చిరంజీవి బాబాయ్‌ వరుస అవుతారు. ఆయన `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో తెలుగులో హీరోగా ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా మేఘన నటించడం విశేషం. మరోవైపు ఈటీవీలో ప్రసారమయ్యే `రెచ్చిపోదాం బ్రదర్` కామెడీ షోకి యాంకర్‌గానూ పనిచేస్తుంది. 
 

67

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన హీరోగా ఇప్పటికే లాంచ్‌ కాగా, హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే అది ప్రారంభమైంది. ఇందులో శివానీ రాజశేఖర్‌ కథానాయికగా నటిస్తుంది. 

77

ఇదిలా ఉంటే పవన్‌ తేజ, మేఘన `ఈ కథలో పాత్ర కల్పితం` చిత్రంలో కలిసి నటించిన నేపథ్యంలో ఈ చిత్రం నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. ఆ ప్రేమ బలపడి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories