కూతురు విషయంలో సురేఖ వాణిని ఏకిపారేసిన హేమ... బోల్డ్ గా ఉంటుంది, తప్పుగా చెప్పింది అంటూ ఆరోపణలు

Published : Aug 11, 2022, 04:07 PM IST

ముక్కుసూటిగా ఉండే నటి హేమకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి ఆమె వార్తలకు ఎక్కారు. తాజాగా హేమ మరో నటి సురేఖ వాణిని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.  

PREV
16
కూతురు విషయంలో సురేఖ వాణిని ఏకిపారేసిన హేమ... బోల్డ్ గా ఉంటుంది, తప్పుగా చెప్పింది అంటూ ఆరోపణలు
Surekha Vani

సురేఖ కూతురు సుప్రీత(Supritha) తన కూతురు ఈషా మంచి ఫ్రెండ్స్ కాగా ఆమె వాళ్ళను విడగొట్టారని, తన గురించి షూటింగ్ లో వేరే వాళ్లకు తప్పుగా చెప్పేవారని ఆమె ఆరోపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖను ఉద్దేశిస్తూ హేమ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

26
Surekha Vani


ఇంతకీ హేమ ఏమన్నారంటే... సురేఖ నేను బెస్ట్ ఫ్రెండ్స్. మాలాగే మా అమ్మాయిలు సురేఖ, ఈషా కూడా మంచి స్నేహితులు. అయితే సురేఖ వాళ్ళను విడగొట్టాలని చూసింది. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుతుండగా సుప్రీతను వేరే స్కూల్ లో చేర్చింది. అయినా సుప్రీత మరలా తన కూతురు ఉన్న స్కూల్ కే తిరిగి వచ్చేసింది. 
 

36

సుప్రీత కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఆ కారణంతోనే నా కూతురు ఈషాకు ఆమెను దూరం చేయాలని సురేఖ ప్రయత్నం చేసింది. అంతే కాకుండా షూటింగ్స్ సెట్స్ లో సురేఖ వేరే వాళ్ళకి నా గురించి తప్పుగా చెప్పారు. ఇవన్నీ  తెలిశాక ఆమెను కలవడం మానేశాను. నేను సురేఖకు దూరంగా ఉంటున్నానని.. హేమ చెప్పుకొచ్చారు. సురేఖపై హేమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

46


మరి హేమ ఆరోపణలకు సురేఖ ఎలా స్పందిస్తారో చూడాలి. మూడేళ్ళ క్రితం సురేఖ వాణి భర్త అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి ఆమె కూతురు సుప్రీతతో ఒంటరిగా ఉంటున్నారు. ఆ మధ్య రెండో పెళ్లి వార్తలు రాగా సురేఖ వాణి(Surekha Vani) ఖండించారు. తనకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. 

56
Surekha Vani


సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సురేఖ, సుప్రీత బెస్ట్ ఫ్రెండ్స్ మాదిరి మెలుగుతారు. ట్రెండీ బట్టలు ధరించడం వీడియోలు చేయడం, ఫోటోలు దిగడం అలవాటు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. సుప్రీతను హీరోయిన్ చేయాలనేది ఆమె లక్ష్యంగా తెలుస్తుంది. 

66
Surekha Vani


ఇక హేమ(Hema) విషయానికి వస్తే... ఆమె ఇప్పటికే పలు వివాదాల్లో వార్తలకు ఎక్కారు. గత ఏడాది జరిగిన మా ఎన్నికల సమయంలో హేమ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ మా అధ్యక్షుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్ లో మంచు విష్ణు ప్యానెల్ సభ్యుడు శివ బాలాజీ చేయి కొరికి అందరినీ షాక్ కి గురి చేశారు. 

click me!

Recommended Stories